మాదాపూర్ శిల్పారామంలో అలరించిన గాత్ర కచేరి, కూచిపూడి నృత్య ప్రదర్శనలు – ఆకట్టుకున్న మొహినియాట్టం – సందడిగా సాగిన ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా‌

మాదాపూర్ శిల్పారామంలో అలరించిన గాత్ర కచేరి, కూచిపూడి నృత్య ప్రదర్శనలు – ఆకట్టుకున్న మొహినియాట్టం – సందడిగా సాగిన ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా‌

మాదాపూర్ శిల్పారామంలో  ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా‌లో వివిధ రాష్ట్రాల నుండి  దాదాపుగా 500  స్టాల్ల్స్ సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి. వుడ్ కార్వింగ్, టెర్రకోట, చేనేత వస్త్రాలు, హస్తకళలు ఉత్పత్తులు  ఎంతగానో ఆకట్టుకుంటున్నవి. వేంకటగిరి పటు చీరలపై కలంకారీ ప్రింట్ సారీస్, ఝాముడని, బండారులంక చీరలు, కోట సారీస్, మహేశ్వరం, మధుబని పెయింటింగ్, పాతచిత్ర పెయింటింగ్, ఆయిల్ పెయింటింగ్స్, గుజరాత్ బ్యాగ్స్, వాల్ హ్యాంగింగ్స్, ఆర్టిఫిషల్ జ్యువలరీ, మొదలైనవి ప్రత్యేకంగా ఉన్నవి.

ఈరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శేషం రమణ తన శిష్య బృందంచే వేణువు గాత్ర కచేరి ఆధ్యంతం అలరించింది. తరువాత కేరళ నుండి విచ్చేసిన  ప్రముఖ కూచిపూడి నృత్య గురువులు శ్రీమతి అనుపమ మోహన్ శిష్య బృంచే కూచిపూడి నృత్య ప్రదర్శనలో బ్రహ్మాంజలి, గణపతి స్తుతి, స్వాతి తిరుణాల్ కృతి,  మొహినియాట్టం పదం కన్నప్ప చరితం, ఓం నమఃశివాయ  అంశాలను ప్రదర్శించి మెప్పించారు. డాక్టర్ మైథిలి అనూప్ శిష్య బృందం ప్రదర్శించిన మొహినియాట్టం ప్రదర్శన ఆధ్యంతం అలరించింది.

1 thought on “మాదాపూర్ శిల్పారామంలో అలరించిన గాత్ర కచేరి, కూచిపూడి నృత్య ప్రదర్శనలు – ఆకట్టుకున్న మొహినియాట్టం – సందడిగా సాగిన ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా‌”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *