శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: సంప్రదాయబద్ధంగా భోగిమంటలు

సంప్రదాయబద్ధంగా భోగిమంటలు 

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: వైదిక సంప్రదాయ పరిరక్షణలో భాగంగా దేవస్థానం ఈ రోజు (13.01.2021) వేకువజామున “భోగిమంటలు” కార్యక్రమాన్ని నిర్వహించింది.

శ్రీస్వామి అమ్మవార్లకు ప్రాత:కాలపూజలు, మహామంగళహారతులు పూర్తయిన తరువాత ఈ “భోగిమంటలు” వేయబడ్డాయి. ప్రధాన ఆలయ మహాద్వారం ఎదురుగా గంగాధర మండపం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడింది.

సనాతన సంప్రదాయ పరిరక్షణలో భాగంగా ఈ విశేష కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.

ఈనాటి కార్యక్రమంలో ముందుగా అర్చకస్వాములు, వేదపండితులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు.

అనంతరం సంప్రదాయబద్ధంగా పిడకలు, ఎండుగడ్డి, వంటచెరుకుని వేసి “భోగిమంటలు” వేయబడ్డాయి.

సంక్రాంతి సందర్భంగా వేసే భోగిమంటలకు మన సంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది.

మన సంస్కృతి సంప్రదాయాలపై అందరికీ మరింత అవగాహన కల్పించాలనే భావనతో ఈ భోగిమంటల కార్యక్రము నిర్వహించబడింది.

ఈ భోగిమంటలు వేయడం వలన దుష్టపీడలు విరగడై, అమంగళాలు తొలగి సకలశుభాలు కలుగుతాయని చెప్పబడుతోంది. కాగా వైదిక సంప్రదాయంలో సంక్రాంతి పర్వదినానికి ఎంతో విశిష్టత ఉంది.

కేవలం ఆధ్యాత్మికపరంగానే కాకుండా కాకుండా కుటుంబపరమైన అనుబంధాలకు , సామాజిక సమైక్యానికి సంక్రాంతి పండుగ వేదిక నిలుస్తుంది.

Print Friendly, PDF & Email
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *