Month: June 2021

పీవీ శత జయంతి- తొమ్మిది గ్రంధాలను ఆవిష్కరించిన గవర్నర్, సీఎం కేసీఆర్

పీవీ శత జయంతి- తొమ్మిది గ్రంధాలను ఆవిష్కరించిన గవర్నర్, సీఎం కేసీఆర్ బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధానమంత్రి శ్రీ పీవీ నరసింహారావు గారు దేశానికి అందించిన విశిష్ట సేవలను గొప్పగా తలుచుకునే విధంగా, చిరస్మరణీయంగా నిలిచే విధంగా శ్రీ పీవీ నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలను గత ఏడాదికాలంగా తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. విద్యావేత్తగా, సాహితీవేత్తగా సాహితీరంగంలో విశేష కృషి చేసిన పీవీ నరసింహారావు గారికి నివాళిగా మహోన్నత మూర్తిమత్వం ఉన్న పీవీగారి వ్యక్తిత్వాన్ని, …

పీవీ శత జయంతి- తొమ్మిది గ్రంధాలను ఆవిష్కరించిన గవర్నర్, సీఎం కేసీఆర్ Read More »

పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్క‌రించిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌందర్ రాజన్, ముఖ్య‌మంత్రి కె.చంద్రశేఖర్ రావు

పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్క‌రించిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌందర్ రాజన్, ముఖ్య‌మంత్రి కె.చంద్రశేఖర్ రావు మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు శత జయంతి ఉత్సవాలను నగరంలోని పీవీ మార్గ్ లో వున్న జ్ఞానభూమిలో నిర్వహించారు. ఇందులో భాగంగా గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌందర్ రాజన్, ముఖ్య‌మంత్రి కె.చంద్రశేఖర్ రావు నెక్లెస్ రోడ్డులోని 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్క‌రించారు. అనంతరం వారు ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీవీ మార్గ్ ను ప్రారంభించారు. పీవీ …

పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్క‌రించిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌందర్ రాజన్, ముఖ్య‌మంత్రి కె.చంద్రశేఖర్ రావు Read More »

నేడే పీవీ శతజయంతి ఉత్సవాలు

నేడే పీవీ శతజయంతి ఉత్సవాలు  హైదరాబాద్‌ జూన్ 27: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలను ఈ నెల 28న నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పా ట్లు చేస్తోంది. సోమవా రం ఉదయం 11.30కు పీవీ మార్గ్‌లోని పీవీ జ్ఞానభూమి వద్ద జరిగే కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా పీవీపై రూపొందించిన 9 పుస్తకాలను వారు ఆవిష్కరించనున్నారు. బహుభాషా కోవిదుడు, నూతన ఆర్థిక విధానాల …

నేడే పీవీ శతజయంతి ఉత్సవాలు Read More »

సంద‌ర్శ‌కుల‌తో క‌ళ‌క‌ళ‌లాడిన ఉప్పల్ మినీ శిల్పారామం

సంద‌ర్శ‌కుల‌తో క‌ళ‌క‌ళ‌లాడిన ఉప్పల్ మినీ శిల్పారామం తాజాగా లాక్‌డౌన్‌ ఎత్తివేసిన అనంతరం ఉప్పల్ మినీ శిల్పారామంలో ఈరోజు సందర్శకుల కోసం మధ్యాహ్నం తెరుచుకుంది. సందర్శకులు విచ్చేసి ఎంతో ఉత్సాహంగా శిల్పారామం అంతా కలియ తిరిగారు. చిన్న పిల్లలు ఆటలాడుతూ ఎంతో ఆనందంగా గడిపారు. చేనేత హస్త కళల స్టాల్ల్స్ కొన్ని అందుబాటులో ఉన్నవని, కోవిద్ నిబంధనలను పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

మాదాపూర్‌ శిల్పారామంలో సందర్శకులను ఆక‌ట్టుకున్న రంగురంగుల‌ ప‌క్షులు, బోటు షికారు

మాదాపూర్‌ శిల్పారామంలో సందర్శకులను ఆక‌ట్టుకున్న రంగురంగుల‌ ప‌క్షులు, బోటు షికారు తాజాగా లాక్‌డౌన్‌ ఎత్తివేసిన అనంతరం మాదాపూర్ శిల్పారామంలో ఈరోజు సందర్శకుల కోసం ఉదయం పదిన్నరకు తెరుచుకుంది. సందర్శకులు విచ్చేసి ఎంతో ఉత్సాహంగా శిల్పారామం అంతా కలియ తిరిగారు. చిన్న పిల్లల ఆహ్లాదం కొరకు కొన్ని రంగు రంగుల పక్షులను పిల్లల ఆట స్థలం దగ్గరలో ఏర్పాటుచేయడంతో పాటు బాటరీ కార్ కూడా నడిపిస్తున్నామని అధికారులు తెలిపారు. చిన్నారులు రంగురంగుల ప‌క్షుల‌ను చూస్తూ, బోటు షికారు చేస్తూ …

మాదాపూర్‌ శిల్పారామంలో సందర్శకులను ఆక‌ట్టుకున్న రంగురంగుల‌ ప‌క్షులు, బోటు షికారు Read More »

సోమ‌వారం నుండి తెర‌చుకోనున్న మాదాపూర్ శిల్పారామం

సోమ‌వారం నుండి తెర‌చుకోనున్న మాదాపూర్ శిల్పారామం ప్ర‌కృతి ప్రకృతి అందాల‌తో, కొత్తగా రకరకాల రంగుల పక్షుల కిలకిలారావాలతో, ప‌ల్లె వాతావరణంతో క‌నువిందు చేసే శిల్పారామం సోమ‌వారం నుండి పునఃప్రారంభం కానుంది. తెలంగాణలో లాక్ డౌన్ పూర్తి స్థాయిలో ఎత్తి వేసిన నేపధ్యంలో మాదాపూర్‌లో నెలకొని ఉన్న శిల్పారామం సందర్శకుల కోసం సోమవారం నుండి తెరిచి ఉంటుందని అధికారులు తెలియ చేసారు. ఉదయం 10.30 నుండి సాయంత్రం 8.00 గంటలవరకు సందర్శకుల కోసం తెరిచి ఉంటుందని తెలిపారు. సందర్శకుల …

సోమ‌వారం నుండి తెర‌చుకోనున్న మాదాపూర్ శిల్పారామం Read More »

సోమ‌వారం నుండి తెర‌చుకోనున్న ఉప్పల్ మినీ శిల్పారామం – మధ్యాహ్నం 12.00 నుండి సాయంత్రం 8 .00 గంటలవరకు సందర్శన వేళలు

సోమ‌వారం నుండి తెర‌చుకోనున్న ఉప్పల్ మినీ శిల్పారామం – మధ్యాహ్నం 12.00 నుండి సాయంత్రం 8 .00 గంటలవరకు సందర్శన వేళలు ప్ర‌కృతి ప్రకృతి అందాల‌తో, ప‌ల్లె వాతావరణంతో క‌నువిందు చేసే ఉప్పల్ మినీ శిల్పారామం సోమ‌వారం నుండి పునఃప్రారంభం కానుంది. తెలంగాణలో లాక్ డౌన్ పూర్తి స్థాయిలో ఎత్తి వేసిన నేపధ్యంలో ఉప్పల్ లో నెలకొని ఉన్న మినీ శిల్పారామం సందర్శకుల కోసం సోమవారం నుండి తెరిచి ఉంటుందని అధికారులు తెలియ చేసారు. మధ్యాహ్నం 12.00 …

సోమ‌వారం నుండి తెర‌చుకోనున్న ఉప్పల్ మినీ శిల్పారామం – మధ్యాహ్నం 12.00 నుండి సాయంత్రం 8 .00 గంటలవరకు సందర్శన వేళలు Read More »