పీవీ శత జయంతి- తొమ్మిది గ్రంధాలను ఆవిష్కరించిన గవర్నర్, సీఎం కేసీఆర్

పీవీ శత జయంతి- తొమ్మిది గ్రంధాలను ఆవిష్కరించిన గవర్నర్, సీఎం కేసీఆర్
బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధానమంత్రి శ్రీ పీవీ నరసింహారావు గారు దేశానికి అందించిన విశిష్ట సేవలను గొప్పగా తలుచుకునే విధంగా, చిరస్మరణీయంగా నిలిచే విధంగా శ్రీ పీవీ నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలను గత ఏడాదికాలంగా తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది.
విద్యావేత్తగా, సాహితీవేత్తగా సాహితీరంగంలో విశేష కృషి చేసిన పీవీ నరసింహారావు గారికి నివాళిగా మహోన్నత మూర్తిమత్వం ఉన్న పీవీగారి వ్యక్తిత్వాన్ని, రాజనీతిని, పాలన దక్షతను, ఆర్థిక సంస్కరణలలో వారి కృషిని 360 డిగ్రీలలో ఆవిష్కరించడమే ప్రధాన లక్ష్యమని ప్రకటించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాలమేరకు శ్రీ ”పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల కమిటీ”ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కమిటీకి చైర్మన్ గా సీనియర్ పార్లమెంట్ సభ్యుడు కె. కేశవ రావుని నియమించారు.
పుస్తక ప్రచురణల కోసం ఉప కమిటీ:
పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల కోర్ కమిటీ, పుస్తక ప్రచురణల కోసం ప్రత్యేకంగా ఒక ఉప కమిటీని నిపుణులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉప కమిటీలో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కె రామచంద్రమూర్తి, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, ప్రభుత్వ సలహాదారు- సీనియర్ జర్నలిస్ట్ శ్రీ టంకశాల అశోక్, అధికార భాషా సంఘం అధ్యక్షులు దేవులపల్లి ప్రభాకర్ రావు, శ్రీ పీవీ నరసింహారావు తనయుడు ప్రభాకర్ రావు, శ్రీ పీవీ నరసింహారావు తనయ -శాసన మండలి సభ్యురాలు శ్రీమతి సురభి వాణి దేవి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సీతారామా రావు, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు- పీవీ నరసింహారావు శతజయంతి వేడుకల ప్రత్యేక అధికారి మామిడి హరికృష్ణ సభ్యులుగా ఉన్నారు. వీరి పర్యవేక్షణలో దాదాపు సంవత్సర కాలపు కృషితో ఈ పుస్తకాలు వెలుగు చూసాయి.
ఇక ఈ గ్రంధాల ప్రచురణ బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీలకు అప్పగించింది. అలా ఇప్పుడు మొత్తం 8 పుస్తకాలను ప్రచురించారు. వాటిలో శ్రీ పీవీ రాసినవి 4 పుస్తకాలు కాగా, మిగతావి ఆయన కృషిని, జీవితాన్ని విశ్లేషించే గ్రంథాలు కావడం విశేషం.
వాటి వివరాలు:
శ్రీ పీవీ నరసింహారావు రచనలు (ఇంగ్లీష్ లో)
1. Influence of India’s Culture on the West and Other Speeches: పశ్చిమ దేశాలపై భారత సంస్కృతి ప్రభావంపై పీవీ నరసింహారావు గారి ప్రసంగాల సంకలనం
2. The Granny & Other Stories: పీవీ నరసింహారావు గారు రాసిన 8 అరుదైన కథల సంకలనం. ఇందులో ప్రసిద్ధ గొల్ల రామవ్వ కథ కూడా ఉంది.
3. The Meaning of Secularism and Other Essays: పీవీ నరసింహారావు గారు వివిధ సందర్భాలలో రాసిన వ్యాసాల సంకలనం
4. Thus Spake PV-Interviews with P.V.Narasimha Rao: పీవీ నరసింహారావు గారిని వేర్వేరు మీడియా ప్రతినిధులు చేసిన ఇంటర్వ్యూల సంకలనం
శ్రీ పీవీ గారిపై ఇతర పుస్తకాలు (ఇంగ్లీష్ లో)
5. P.V. Narasimha Rao-Architect of India’s Reforms: పీవీ నరసింహారావు చేసిన ఆర్థిక సంస్కరణలపై, ఆయన పాలనా రీతులపై దేశ, విదేశాలకు చెందిన అగ్ర నాయకులు రాసిన వ్యాసాల సంకలనం. ఈ కాఫీ టేబుల్ బుక్ కు ప్రముఖ జర్నలిస్టు సంజయ బారు సంపాదకుడిగా వ్యవహరించారు.
6. Legend in Lines: పీవీ నరసింహారావు గారు స్ఫూర్తిగా దాదాపు 125కు పైగా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర కార్టూనిస్ట్ లు వేసిన క్యారికేఛర్ ల సంకలనం
7. Chanakya: పీవీ నరసింహారావు గారి జీవిత చరిత్రపై వెలిజాల చంద్రశేఖర్ రాసిన పుస్తకం
శ్రీ పీవీ గారిపై తెలుగులో ప్రచురించిన పుస్తకాలు
8. నమస్తే పీవీ: పీవీ నరసింహారావు గారి గురించి నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురించిన వ్యాసాల సంకలనం
9. కాలాతీతుడు: పీవీ నరసింహారావు గారి జీవితం స్ఫూర్తితో 143 మంది కవుల కవితా సంకలనం
పై పుస్తకాలను 2021జూన్ 28న పీవీ జ్ఞానభూమిలో పీవీ నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు.
https://www.facebook.com/1545099155/videos/10226548140600152/

(courtesy: https://www.facebook.com/harikrishna.mamidi)

Print Friendly, PDF & Email
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *