వైకుంఠ ఏకాదశీ ప్రయుక్త అధ్యయనోత్సవాలులో ఏడవ (7వ) రోజు శ్రీరామావతారంలో స్వామి వారు
ఈ నెల 3వ తేదీ నుండి భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశీ ప్రయుక్త అధ్యయనోత్సవాలులో భాగంగా ఏడవ (7వ) రోజు శ్రీరామావతారంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామి వారు.
ఈనాటి 09-01-2022 సప్తమి – ఆదివారము – శ్రీరామావతారంలో
లోకకంటకులైన రావణ కుంభకర్ణాది రాక్షసులను సంహ రించడానికై దశరథుని కుమారునిగా శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారం శ్రీరామావతారం. వ్యక్తిగత సౌఖ్యాలకన్నా ధర్మాచరణయే ఉత్తమమైనదని అదే శాశ్వతమైనదని భావించి, పరిపూర్ణమైన మానవుడు ఎలా వుండాలో ఆచరించి చూపించిన ఆదర్శపురుషుడు, మర్యాదా పురుషోత్తముడు, మూర్తీభవించిన ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు. సూర్య గ్రహబాధలున్నవారు రామావతారాన్ని దర్శించడం వలన ఆ బాధల నుండి విముక్తిని పొందుతారు అని తెలియచేయబడింది.