వైకుంఠ ఏకాదశీ ప్రయుక్త అధ్యయనోత్సవాలులో ఎనిమిదవ (8వ) రోజు బలరామావతారంలో శ్రీ సీతారామచంద్ర స్వామిరు
ఈ నెల 3వ తేదీ నుండి భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశీ ప్రయుక్త అధ్యయనోత్సవాలులో ఈరోజు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దశావతారాల్లో భాగమైన ఎనిమిదో అవతారం బలరామావతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు….
ఈనాటి 10-01-2022 అష్టమి – సోమవారం – బలరామావతారంలో
శ్రీహరికి శయనమైన ఆదిశేషుని అంశతో అవతరించి, “కృషితో నాస్తి దుర్భిక్షం” అన్న దానికి ప్రతీకగా నాగలిని ఆయుధంగా ధరించి శ్రీకృష్ణునికి అన్నగా నిలిచి, ఆయనకు ధర్మస్థాపనలో సహకరించిన అవతారం శ్రీ బలరామావతారం. సంకర్ష ణునిగా పిలువబడే బలరాముడు ప్రలంబాసురుడనే రాక్షసుని సంహరించాడు. ఈ అవతారాన్ని దర్శించిన వారికి మాందిగుళికా గ్రహాల బాధలు తొలగిపోతాయి అని తెలియచేయబడింది.