Breaking News

Arts and Culture, Festivals and Traditions, General News - ఇతర వార్తలు మిత్రులు, శ్రేయోభిలాషులందరికి భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు – Kalavaibhavam.com

Tuesday 18 - 01 - 2022

భద్రాచలం (03-01-22): భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో వైభవంగా వైకుంఠ ఏకాదశీ ప్రయుక్త అధ్యయనోత్సవాలు ప్రారంభం – మొదటి రోజు మత్స్యావతారములో దర్శనమిచ్చిన స్వామివారు

image_print

భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో వైభవంగా వైకుంఠ ఏకాదశీ ప్రయుక్త అధ్యయనోత్సవాలు ప్రారంభం – మొదటి రోజు మత్స్యావతారములో దర్శనమిచ్చిన స్వామివారు

ఈ నెల 3వ తేదీ నుండి భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశీ ప్రయుక్త అధ్యయనోత్సవాలులో భాగంగా 1వ రోజు మత్యావతరంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామి వారు.

శ్రీమతే రామానుజాయ నమ: మత్స్యావతారము

ఈనాటి 03-01-2022 పాడ్యమి – సోమవారము పగల్‌పత్తు ప్రారంభం యొక్క విశేషం

శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాల వరునలో మొట్టమొదటి అవతారం మత్స్యావతారం. ఈ అవతారానికి సంబంధించి రెండు గాధలు పురాణాలలో ఉన్నాయి. ఒకటి జ్ఞాననిధులైన వేదాలను బ్రహ్మ నుండి అపహరించి నముద్రంలో దాగిఉన్న సోమకానురుని సహకరించడానికై మత్స్యావతారం ధరించి, వేదాలను ఉద్దరించాడు. రెండవది జలప్రళయం నుండి నావలో ఉన్న వైవస్వత మనువును, సప్త ఋషులను, సృష్టికి అవసరమైన విత్తనాలను, ఔషధులను రక్షించాడు. ఈ అవతారాన్ని పూజించుట వలన కేతుగ్రహ బాధలు తొలగుతాయి అని తెలియచేయబడింది.

image_print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×