ఉప్పల్ శిల్పారామంలో నటరాజ రామకృష్ణ గారి 98వ జన్మ దినోత్సవ సంబరాలు

ఉప్పల్ శిల్పారామంలో నటరాజ రామకృష్ణ గారి 98వ జన్మ దినోత్సవ సంబరాలు

DR. NATARAJA RAMAKRISHNA 98TH BIRTHDAY CELEBRATIONS UPPAL MINI SHILPARAMAM


డాక్టర్ నటరాజ రామకృష్ణ (1933 మార్చి 31 – 2011 జూన్ 7) కూచిపూడి నాట్య కళాకారుడు. ఇండోనేషియా లోని బాలి ద్వీపంలో జన్మించాడు. ఆంధ్రనాట్యము, పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చాడు.

పదవ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్య కాలంలో ప్రాచుర్యంలో ఉన్న పేరిణి శివతాండవం నాట్యాన్ని పునరుద్ధరించాడు. ప్రబంధ నాట్య సంప్రదాయానికి సంబంధించిన నవజనార్దనంను కూడా పునరుద్ధరించాడు. నటరాజ రామకృష్ణ ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని కళాసాధన చేశాడు. కుటుంబాన్నీ, సంపదల్నీ వదిలి నాట్యంకోసం జీవితాన్ని అంకితం చేశాడు. 18 ఏళ్ళ వయసులో నాగపూరులో ఆయనకు “నటరాజ” అనే బిరుదును ఇచ్చారు. అప్పటినుండి అది ఆయన పేరు ముందు శాశ్వతంగా చేరిపోయింది.

నటరాజ రామకృష్ణ ఆంధ్రనాట్యం, పేరిణి నృత్యాల పురోగతికై, లక్షా ఏభై వేల రూపాయలతో నటరాజ రామకృష్ణ ఆంధ్రనాట్యం సంస్థను నెలకొల్పాడు. దీని ద్వారా వర్ధమాన కళాకారులకు, వృద్ధ కళాకారులకు ధన సహాయం, పింఛను అందజేస్తారు. నటరాజ రామకృష్ణ లేకపోతే ఆంధ్రనాట్యం, పేరిణీ శివతాండవము ఏనాడో మరుగున పడిపోయేవి. హైదరాబాదులోని తారామతి మందిరము, ప్రేమావతి మందిరాలను ఆయన బాగు చేయించాడు. తారామతి, ప్రేమావతులు గోల్కొండ నవాబు, కుతుబ్ షాహి ఆస్థాన నర్తకీమణులు.

రామకృష్ణ అనేకమంది దేవదాసి నృత్య కళాకారిణులను సంఘటితం చేసి వారి సాంప్రదాయ నృత్యరీతులను అధ్యయనం చేశాడు. ఈరోజు వారి శిష్యులు ప్రశిష్యులు అందరు కలిసి నటరాజ రామకృష్ణ గారి 98వ జన్మ దినోత్సవ సంబరాలు ఉప్పల్ మినీ శిల్పారామం ఆవరణలో నిర్వహిస్తున్నారు. ప్రముఖ శిష్యులు శ్రీ కాలకృష్ణ ఆద్వర్యంలో ప్రశిష్యులు శ్రీ పేరిణి పవన్ నేతృత్వంలో ఆంధ్రా నాట్యం మరియు పేరిణి శివతాండవ ప్రదర్శనలు ప్రదర్షింపబడినవి.

వాగ్దేవి ఆర్ట్స్ అకాడమీ శ్రీమతి సంధ్య పవన్ గారి శిష్య బృందం కుంభ హారతి, నవగ్రహ హారతి అంశాలను , శ్రీ పేరిణి కుమార్ గారి శిష్య బృందం శివ కైవారం, అధ్యత్మ రామాయణ కీర్తన, తిల్లాన అంశాలను , శ్రీ ఉమా మహేశ్వర పాత్రుడు శిష్య బృందం శబ్దం, కృతి, పదం అంశాలను, శ్రీ శ్రీనివాస్ గారి శిష్య బృందం కలప అంశాలను ప్రదర్శించి మెప్పించారు. శ్రీమతి శ్రీరంగం రాఘవ కుమారి గారికి మరియు శ్రీమతి రామ జగన్నాధ్ గారిని ఘనంగా సత్కరించి నటరాజ రామకృష్ణ గారిని స్మరించుకున్నారు.

Print Friendly, PDF & Email
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *