Breaking News

Arts and Culture, Festivals and Traditions, General News - ఇతర వార్తలు మిత్రులు, శ్రేయోభిలాషులందరికి భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు – Kalavaibhavam.com

Tuesday 18 - 01 - 2022

మాదాపూర్ శిల్పారామంలో సాంస్కృతిక ప్రదర్శనల్లో పాల్గొన్న ఆయా రాష్ట్రాల‌ కళాకారులు – ఆకట్టుకున్న భారత నాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు

By on Dec 28, 2021 in Shilparamam
image_print

మాదాపూర్ శిల్పారామంలో సాంస్కృతిక ప్రదర్శనల్లో పాల్గొన్న ఆయా రాష్ట్రాల‌ కళాకారులు – ఆకట్టుకున్న భారత నాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు

మాదాపూర్ శిల్పారామంలో నిర్వహిస్తున్న అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాలో వివిధ రాష్ట్రాల నుండి చేనేత హస్తకళా ఉత్పత్తులే కాకుండా సాంస్కృతిక ప్రదర్శనల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన కళాకారులు విచ్చేసి సాంస్కృతిక ప్రదర్శనలో పాల్గొన్నారు.

బెంగళూరు నుండి వైష్ణవి నాట్యశాల గురువర్యులు మిథున్ శ్యామ్ శిష్య బృందం భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. పుష్పాంజలి, గణేశా స్తుతి, దేవి స్తుతి, శృంగారపుదీశ్వరి శారదే, దేవర్ణమా జగన్ మోహన్, బ్రోచేవారు ఎవరురా కృతి, శివ స్తుతి, ఎందరో మహానుభావులు  మొదలైన అంశాలను మాస్టర్ శశాంక్ కిరణ్, కావ్య కాశీనాథన్, గాయత్రీ గురు ప్రసాద్, రితిక, శ్వేతా సునీల్ ప్రదర్శన ఆధ్యంతం అలరించింది.

కూచిపూడి నృత్య ప్రదర్శనలో భాగంగా జయంతి నారాయణ శిష్య బంధం గణపతి ప్రార్ధన, స్వరపల్లవి, శివ పంచాక్షర స్తోత్రం, నటరాజ స్తుతి,శివ పార్వతి తాండవ లాస్యం, వరవీనా గీతం, అన్నమాచార్య కీర్తన, రుక్మిణి ప్రవేశం, గణపతి కౌత్వం, త్యాగరాయ కీర్తన, తిల్లాన అంశాలను కుమారి ప్రత్యుష, కార్తీక, నైవేద్య, తేజస్వి, గాయత్రీ, సృజన, సాహితి, ఆరాధ్య, శ్రీనిధి మొదలైన వారు ప్రదర్శించారు.

image_print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×