(Kalaviabhavam.com 13.07.19): UPPAL Shilparamam – శింజిని స్కూల్ అఫ్ ఆర్ట్స్, సింధూజ నేతృత్వంలో – ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శనలు

ఉప్పల్ శిల్పారామం: శింజిని స్కూల్ అఫ్ ఆర్ట్స్, సింధూజ నేతృత్వంలో – ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శనలు

వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఉప్పల్ శిల్పారామం అంఫిథియేటర్ లో ” శింజిని స్కూల్ అఫ్ ఆర్ట్స్ ” సింధూజ తాను తన శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు.

శ్లోకం, వినాయక కాతం, శంకర శ్రీగిరి, రామాయణ శబ్దం, తరంగం, కొలువైతివారంగస్వామి, ముద్దుగారే యశోద, థిల్లాన అంశాలను శ్రీమతి సింధూజ, సిరి చందన, అనన్య, శ్రీనిధి, సిద్ధి, దేవర్షిణి మొదలైనవారు ప్రదర్శించి సందర్శకులను మెప్పించారు.

వరుసగా రెండవ శనివారం, ఆదివారం సెలవు రోజులు కావడం వల్ల ఉప్పల్ శిల్పారామంలో సందర్శకులు అధికంగా విచ్చేసారు.

పోచంపల్లి రెడీమేడ్ డ్రెస్సెస్, లెథర్ హ్యాండ్ బాగ్స్, బ్రాస్ మెటీరియల్, బంజారా నీడిల్ వర్క్ బాగ్స్ మొదలైనవి మహిళలను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *