నేడే పీవీ శతజయంతి ఉత్సవాలు

నేడే పీవీ శతజయంతి ఉత్సవాలు

 హైదరాబాద్‌ జూన్ 27: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలను ఈ నెల 28న నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పా ట్లు చేస్తోంది. సోమవా రం ఉదయం 11.30కు పీవీ మార్గ్‌లోని పీవీ జ్ఞానభూమి వద్ద జరిగే కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా పీవీపై రూపొందించిన 9 పుస్తకాలను వారు ఆవిష్కరించనున్నారు. బహుభాషా కోవిదుడు, నూతన ఆర్థిక విధానాల రూపశిల్పి పీవీ సేవలను గుర్తు చేసుకుంటూ ప్రసంగిస్తారు. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచా రి వ్యాఖ్యాతగా వ్యవహరించే ఈ కార్యక్రమంలో పీవీ శత జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు స్వాగతోపన్యాసం చేస్తారు. నెక్లెస్‌రోడ్‌లో పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.  

Print Friendly, PDF & Email
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *