స్వర వేదిక, కీర్తన అకాడమీ అఫ్ మ్యూజిక్ సంయుక్త నిర్వహణలో ఎపిసోడ్-25తో  “స్వర” మధురంగా, ఘనంగా ముగిసిన స్వర రాగ గీతం సీజన్ – 1 కార్యక్రమం 05-Dec-2020

స్వర వేదిక, కీర్తన అకాడమీ అఫ్ మ్యూజిక్ సంయుక్త నిర్వహణలో ఎపిసోడ్-25తో  “స్వర” మధురంగా, ఘనంగా ముగిసిన స్వర రాగ గీతం సీజన్ – 1 కార్యక్రమం

Swara Raga Geetham concluded with a grand swara neeraajanam to sri SP Balasubrahmanyam with a line up of 25 Episodes  – 05-Dec-2020 in association with SwaraVedika, Keerthana Academy of Music hosted by Parthasaradhi Nemani (Parthu)

ఈ కార్యక్రమం ఎపిసోడుని స్పాన్సర్ చేసిన వారు కాంచ్ టెక్నాలజీస్ (Conch Technologies), మధు మారేడు & పూర్ణ పెరవలి and Kutir.కామ్

స్వర వేదిక మరియు కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న స్వర రాగ గీతం సీసన్-1 ముగింపు సంచికకు స్వాగతం పలికారు ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, వ్యాఖ్యాత, కార్యక్రమం నిర్వాహకుడు, పార్థసారథి నేమాని (పార్థు)

పార్థు వాఖ్యానాన్ని ప్రారంభిస్తూ… స్వర రాగ గీతం కార్యక్రమంలో గత సంచికను ఈ సంచికను కూడా బాలు గారి పాటల ని సెలబ్రేట్ చేసుకోవడానికి మనము నిర్మించుకున్నాం కదా ఇరవై మూడు వారాలలో ప్రతి వారం ఒక రాగం యొక్క విశేషాలు మీకు చెప్పి ఆ రాగంలో కీర్తనలు, సినిమా పాటలు నేను మీకు వినిపించడం తర్వాత మా పిల్లలు అదే రాగంలోని, పాటలు, కీర్తనలు పాడటం జరుగుతోంది.  అయితే ఈ సంచికని బాలు గారే వచ్చి తన పాట వినిపిస్తే ఎలా ఉంటుంది! అది కూడా ఇప్పుడు ఇప్పటివరకు వినని పాట అయితే ఇంకెలా ఉంటుంది!  అది సాధ్యమేనా అని అనుమానం రావచ్చు, కానీ సాధ్యమే. స్వర వేదిక సంస్థని అమెరికాలో జరిగిన పాడుతా తీయగాలో పాల్గొన్న చిన్నారులు వారి తల్లిదండ్రుల ఆశీర్వాదంతో, ప్రోత్సాహంతో స్థాపించి, పాటలు పాడి విరాళాలు సేకరించి భారతదేశంలో ఎన్నో చారిటీ ఆక్టివిటీస్ కి ఆ ఫండ్స్ ని డొనేట్ చేస్తున్న  విషయం మనం గత సంచికల్లో కూడా చెప్పుకున్నాం.  సంస్థకు సంబంధించిన ఆశయాలను, లక్ష్యాలను ఒక పాట రూపంలో తీసుకు రావాలని ఆలోచన వచ్చినప్పుడు దాన్ని కంపోజ్ చేసే అదృష్టాన్ని నాకు కలిగించారు స్వర వేదిక నిర్వాహకులు. 

ఈ పాటను అతయద్భుతంగా ప్రముఖ సినీ రచయిత అనంత శ్రీరామ్ గారు రాస్తే, మరి ఇంకెవరు పాడుతారు అనుకున్నప్పుడు…. ఇంకెవరు మా పెద్ద బాలుగారే పాడాలి అనుకున్నాం. ఇది దాదాపు ఏడాది క్రితం జరిగిన విషయం. ఏ కారణాల వల్లనో ఆ పాటని పూర్తిగా రిలీజ్ చేయడం కుదరలేదు, బహుశా స్వరరాగ గీతంలోని ముగింపు సంచికలో బాలు గారికి డెడికేట్ చేయడం కోసమే ఈ రిలీజ్ జరగలేదు అనేది నా అభిప్రాయం. అందుకే బాలు గారు ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి వచ్చి మళ్లీ మీ అమృతతుల్యమైన గానాన్ని మాకు ప్రత్యక్షంగా వినిపించండి. ఈ స్వర వేదిక టైటిల్ సాంగ్ ని వినిపించడానికి మన బాలు గారిని గౌరవంగా, వినయంగా, సభక్తికంగా ఆహ్వానిస్తున్నాం అని ఎంతో వినయపూర్వకంగా తెలుపుతూ ఈ టైటిల్ సాంగ్ ” ఒక్కతాటి పై కొచ్చారు… ముక్తకంఠమై ధ్వనించగా, లక్ష పాటలై వచ్చారు, లక్ష్య సాధనే ఫలించగా…” అని బాలు గారు పాడిన ఈ అద్భుతమైన స్వర రాగ గీతం టైటిల్ సాంగ్ ని వీక్షకులకు వినిపించి ఎంతో ఆనందింపచేసారు పార్థు. 

ఎంత బాగుందో కద…. బాలు గారు మన మధ్య వుండి పాడినట్లే లేదు, అని పార్థు ఎంతో ఆనందంగా చెప్పారు!!!

ఇంత మంచి అవకాశం కల్పించిన స్వర వేదికకు కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి స్వర రాగ గీతం కార్యక్రమం యొక్క ముగింపు సంచిక కాబట్టి ఈ కార్యక్రమం సక్సెస్ కోసం పాటు పడినటువంటి కమిటీ సభ్యులందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని చెప్పారు పార్థు.

ముఖ్యంగా శ్రీమతి సౌజన్య వేములపాటి, శ్రీమతి విజయ పేర్వేల, శ్రీమతి శిరీష మల్లాది, శ్రీమతి కళ్యాణి మంత్రిప్రగడ, శ్రీమతి శుభ మమందుర్, శ్రీమతి కవిత కార్లపాటి, ముఖ్యంగా వీళ్ళందరూ సింగర్స్ కోఆర్డినేషన్ లోను, వాళ్ళకి పాటలు ఆలోకేట్ చేసి, ఆడియోస్, వీడియోస్ అందించడం, వీటన్నిటిలోను వీళ్ళ కృషి నిజంగా చాలా ప్రశంసనీయం, వీళ్ళందరికీ  మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 

అలాగే వీళ్లందరికీ వెన్నుదన్నుగా ఉండి అన్ని విషయాల్లోనూ కంటెంట్ పరంగా కానీయండి టెక్నికల్ పరంగా కానీయండి, వీళ్ళందరికీ సలహాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించినటువంటి ఇంకొక ఇద్దరు సభ్యులు శ్రీ కృష్ణ అనుమోలు, శ్రీ కమలాకర్ కనజం, వీరికి కూడా నా తరుపున, కీర్తన అకాడమీ అఫ్ మ్యూజిక్ తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.

ఇది స్వరవేదిక టీం. అయితే టీమ్ ఉన్నప్పుడు కెప్టెన్ కూడా వుంటారు కదా. ఈ కెప్టెనే శ్రీ వీరభద్రం దంతుర్తి. 

ఈయన ఈ కార్యక్రమం అనుకున్న దెగ్గరినుంచి, ఆయనకు  మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఈ కార్యక్రమాన్నీ అనుకున్న దగ్గర నుంచి  ప్లానింగ్ లోగాని, ఎగ్జిక్యూషన్లో గాని, సింగర్ సెలక్షన్ లో గాని, వాళ్లకి పాటలు ఆలోకేట్ చేయడంగానీ, వర్కింగ్ కమిటీ సభ్యులు కోఆర్డినేట్ చేయడంలో గానీ, ఇటు నాతో, మా టెక్నికల్ టీంతో, ఆర్గనైజేషన్ పరమైన విషయాలు, ఫైనాన్సు,  వీటన్నిటిలోనూ ఆయన ఎంతో సమయాన్ని వెచ్చించి, ఈ కార్యక్రమం యొక్క సక్సెస్ లో ఎంతో దోహద పడిన అటువంటి వ్యక్తి శ్రీ వీరభద్రం దంతుర్తి గారు.  వీరికి ప్రత్యేకంగా నా తరఫున, మా కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ తరపున, అలాగే స్వర రాగ గీతం ప్రేక్షకులందరి తరపున కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.  ఎందుకంటే ఇంత మంది సహకారం లేకపోతే ఇంత పెద్ద కార్యక్రమం అందులోనూ ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరు ఇళ్లనుంచి పనిచేస్తూ, ఇలాంటి కార్యక్రమం మీ దగ్గరికి ఇరవై ఐదు వారాల పాటు తీసుకురావడం అంటే సామాన్య విషయం కాదు.  మరొకసారి వీరందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.  కార్యక్రమం అయిపోయింది అనుకోకండి కార్యక్రమంలో చివర్లో చెప్పడం ఫార్మాలిటీ అవుతుందేమోనని ముందుగానే చెబుతున్నాను అని ఎంతో వినయపూర్వకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలియచేసారు పార్థు.

ఆయన వాత్సల్యం ఎవరెస్టు శిఖర సమున్నతం, ఆదరణ ఆకాశమంత విస్తృతం, నవ్వితే నయాగరా జలపాతం, పలకరిస్తే పారిజాతాల వర్షం, గళం  గంగా ప్రవాహమై, గానం సాగరసమీరమై రూపుదాల్చిన అనురాగ రూపమే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. సంగీతం,భాష, భావ ప్రకటన ఈ మూడు కోణాలు సరి సమానంగా వున్నా ఎక్విలాటరల్ ట్రింగల్ మన బాలుగారు. పాటకు మూలాధారమైన ఈ మూడు బాలుగారి గళ పీఠంలో ఓంకారంలా పెనవేసుకున్నాయి. ఇప్పుడు మీరు వినబోయే గీతంలో   సంగీత, సాహిత్య సమలంకృత అయిన సరస్వతీ దేవిని కీర్తిస్తూ సి. నారాయణరెడ్డి గారు రచించిన పదాలకు కె.వి.మహదేవన్ గారి స్వరరచన తోడైతే, బాలు గారి గళం దీన్నో  ప్రార్థనాగీతంగా  నిలబెట్టింది.

కళాతపస్వి విశ్వనాధ్ గారి దర్శకత్వంలో వచ్చిన స్వాతికిరణం చిత్రంలోని ఈ పాటను వినిపించబోతున్న గాయకుడు మాధవ్ దంతుర్తి “సంగీత సాహిత్య సమలంకృతే సంగీత సాహిత్య సమలంకృతే… స్వర రాగ పదయోగ సమభూషితే హే భారతి మనసాస్మరామి హే భారతి మనసాస్మరామి శ్రీ భారతి శిరసా నమామి శ్రీ భారతి శిరసానమామి” పాటని ఎంతో అద్భుతంగా పాడి వీక్షకుల హృదయాలను అమితంగా ఆకట్టుకున్నాడు.

స్వర రాగ గీతం కార్యక్రమంలో గత 25 వారాలుగా నాకు సహకరించినఅటువంటి నా టీంని కూడా మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ముందుగా శ్రీ ఓలేటి శ్రీనివాస భాను గారు మీరు విన్న అన్ని పాటలకు తన అద్భుతమైన రచనా పటిమతో వ్యాఖ్యానాన్ని అందించినటువంటి రచయిత, కవి పండితులు అనేక పుస్తకాలు రచించారు, అనేక పరిశోధనా వ్యాసాలు కూడా రచించారు. దాదాపుగా కొన్నేళ్లుగా వీరి రచన లేనటువంటి వారపత్రిక ఉండదు అంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాగే నేను చేసినటువంటి అనేక కార్యక్రమాలు విశ్వనాధామృతం కానివ్వండి, ఈ మధ్యకాలంలో చేసినటువంటి పలికెద భాగవతం కార్యక్రమాలకు ఆ పద్యాలన్నిటికి కూడా వారే భావాలు కూడా రచించారు. ఈ సందర్భంగా శ్రీ భాను గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

అలాగే గత 25 వారాలలో మీరు రెండు వందల పైచిలుకు నా కీర్తనలు, పాటలు విన్నారు. వీటన్నిటికీ తమ అసమాన సంగీత నైపుణ్యంతో సహకారం అందించినటువంటి అపూర్వ సహోదరులు సాయి కుమార్, పవన్ కుమార్. సాయి కిబోర్డు, ఫ్లూట్ మెలోడీస్ ఇన్స్ట్రుమెంట్స్, దాదాపు 12 ఇన్స్ట్రుమెంట్స్   వాయించగల దిట్ట. అలాగే పవన్ కుమార్ శాస్త్రీయ సంగీతానికి మృదంగమైనా కానీయండి, కంజిర లాంటి ఏ ఇన్స్ట్రుమెంట్స్ అయినా ఇటు వెస్ట్రన్ సాంగ్స్ కి డ్రమ్స్, పాడ్స్ కాని వీటన్నిటిని వాయించడంలో దిట్ట పవన్. అలాగా వీళ్లిద్దరు తమ వాయిద్య నైపుణ్యంతోటి ఈ పాటలన్నీ బెస్ట్ క్వాలిటీ తో మీ అందరికీ వినిపించడానికి నాకెంతో హెల్ప్ చేశారు వీరిద్దరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.  అలాగే ఈ మహాయజ్ఞంలో నాకు సహకరించిన మరొక సంగీత కళాకారుడు పవన్ బోగీల ఇతను  మంచి గాయకుడు అలాగే మంచి వయోలిన్ విద్వాంసులు కూడా. ఈ కార్యక్రమంలో పిల్లలు పాడినటువంటి శాస్త్రీయ సంగీత కీర్తనలు అన్నిటికీ తన సహకారం అందించాడు పవన్ థాంక్యూ సో మచ్ అని తనకు సహకరించినవారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పార్థు.

నన్ను బాగా వెంటాడుతున్నటువంటి పాట బాలుగారి పాట “లలిత కళారాధనలో వెలిగే చిరు దివ్వెను నేను”.  కళ్యాణి సినిమా కోసం డాక్టర్ సి.నారాయణరెడ్డి గారి రచన, రమేష్ నాయుడు గారి  సంగీతం బాలు గారి గానం… ఒక్కసారి ఈ పాట మీకోసం అని “లలిత కళారాధనలో వెలిగే చిరు దివ్వెను నేను” అని ఎంతో చక్కగా పాడి వినిపించారు పార్థు.

సినిమాల్లో పాడే ప్లే బ్యాక్ సింగర్ వాయిస్ ఏదో కార్నెర్ నుండి వినిపించడం కాకుండా సినిమా మధ్య స్క్రీన్ మధ్యలోంచి వినిపించేట్టుగా ఉండాలి, అందుకే ప్లేబ్యాక్ శింగింగ్ ఈస్ ఏ స్పెషలైజ్డ్ ఆర్ట్  అన్నారు భారతరత్న లతా మంగేష్కర్,  ది బెస్ట్ ఎగ్జాంపుల్ మన బాలుగారు.  ఆయన వాయిస్ సినిమా ఫ్రేమ్ లో పర్ఫెక్ట్ గా అతుక్కుపోతుంది. 

అందుకే వీణావేణువైన మధురిమను, తీగ రాగమైన సరిగమలు మనకందించి ఆయన మన అందరి హృదయాలలో పేర్మనంట్ గా సెటిల్ అయ్యారు. వేటూరి గారు, రాజన్ నాగేంద్ర గారు ఈ కాంబినేషన్ లో ఇంటింటి రామాయణం  సినిమా కోసం బాలు గారు, జానకి గారు పాడిన ఈ మెలోడీని గాయని ప్రియా కనజం వీణ వేణువైన సరిగమ విన్నావా… ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..తనువు తహ తహలాడాల.. చెలరేగాల..చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో వీణ వేణువైన సరిగమ విన్నావా… ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..” అంటూ ఎంతో హుషారుగా పాడి వీక్షకులకు వీనులవిందు చేసి ఆకట్టుకుంది.

బాలు గారు నిర్వహించినటువంటి మొట్టమొదటి పాడుతా తీయగా సిరీస్ లో పాల్గొన్న తర్వాత, ఎన్నో సినిమాలకు పాటలు పాడి ఎంతో  మంచి పేరు తెచ్చుకున్న గాయనీ గాయకుల జంట గోపిక పూర్ణిమ, మల్లికార్జున్. ముఖ్యంగా వీళ్లిద్దరు అంటే బాలు గారికి ఎంత అభిమానమో నేను మాటల్లో చెప్పలేను. బాలు గారి తో ఎన్నో సందర్భాలలో దేశ విదేశాలలో ఎన్నో వందలాది షోస్ లో పాల్గొన్నటువంటి అనుభవం వీరిది. ఇప్పుడు మల్లికార్జున్, గోపిక పూర్ణిమ గారు బాలు గారి తో తమకున్న అనుబంధాన్ని అనుభవాలను మీతో పంచుకుంటారు అని పరిచయం చేసారు పార్థు.

మల్లికార్జున్, గోపిక పూర్ణిమ తమ స్పందనను తెలియచేస్తూ…. అందరికి నమస్కారం స్వర వేదిక మరియు కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ కార్యక్రమంలో ఈ సీజన్లో ఈ సిచువేషన్ లో ఇన్ని ఎపిసోడ్స్ ను ఇంత  క్వాలిటీ తో  చేయడం అనేది చాలా గొప్ప విషయం. అందరూ కూడా వాళ్ల వాళ్ల  ఇళ్ల నుంచి వారి పాటల్నిపాడడం, రికార్డు చేయడం, పంపించడం. ఇక్కడ అంటే యూఎస్ నుంచి పిల్లలు పాటలు  పంపిస్తూ ఉంటే ఇక్కడ మరొక ఊర్లో నుంచి మ్యూజిక్ చేయడం, పార్థు గారు ఇంటి నుంచి వ్యాఖ్యానం చేసి ఇవన్నీ ఒక దగ్గర మిక్స్ చేసి ఒక ప్రోగ్రాం గా తీర్చిదిద్ది మీకు అందరికీ అందించడం గొప్ప విషయం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనకి పరిస్థితులు ఎలా ఉన్నా పర్వాలేదు సంకల్పం మంచిదైతే అనుకున్నవన్నీ జరుగుతాయి అన్నదానిపై ఈ ప్రోగ్రాం చక్కటి  నిదర్శనం. చాలా ఆనందంగా ఉంది సీజన్ వన్ కంప్లీట్ చేసుకుని ఇంకా చాలా చాలా చాలా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. అలాగే మా ప్రియా మిత్రుడు పార్థసారధి అలాగే మొత్తం స్వరవేదిక టీంకి మా అభినందనలు. పార్థ సారధి చాలా బాగా చేసారు. ఒక సత్సంకల్పం తో చేయాలనుకున్నా, ఒక మంచి వేదిక కూడా కావలి. సో అలాంటి మంచి వేదికను అందించిన స్వర వేదిక వారికి అభినందనలు. ఎందుకంటే మంచి ప్రోగ్రామ్ కావాలి అంటే దాన్ని ప్రొడ్యూస్ చేసే వాళ్ళు కావాలి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడానికి స్వర వేదిక ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.  ఆశీస్సులు తెలియజేస్తున్నాను.

మరి ఈ చివరి ఎపిసోడ్ అయినటువంటి గురుగారు బాలుగారికి అంకితం చేస్తున్న కార్యక్రమం కాబట్టి మరి   ఆయన గురించి ఆయనతో అనుబంధం చెప్పాలంటే ఈ చిన్న బైట్ సరిపోదని, అదొక  మా  జీవితాంతం గుర్తుంచుకునింది ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి.  అంటే ఆయన ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మేము ఆయనతో ప్రయాణం చేసాము. అయితే నేను చెప్పాలనుకున్నది, బాలుగారు నేను పాడిన పాట మంచి పాట వింటే చాలా బాగా పాడారు అని  ప్రశంసించారు. ఎక్కడైనా పొరపాటుగా పాడితే,  చాలా జాగ్రత్తగా పాడాలి అని మందలించేవారు. అలాగే వ్యక్తిత్వ పరంగా పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి అని ఆయన తండ్రి  తర్వాత తండ్రిలా గురువుగా మమ్మల్ని నడిపించే విధానం ఎప్పటికీ మర్చిపోలేము. ఇది నా జీవితాంతం గుర్తుంచుకుంటాను. పొద్దున లేచిన దెగ్గరినినుండి,  నిద్రలో పడుకునే వరకు ప్రతి క్షణం మీరు పాడిన  ఏ పాటయినా గుర్తుపెట్టుకుంటాము. ఆయన జీవితాంతం అందరికీ ఎంతో సంతృప్తిని, ప్రేమని, ఆప్యాయతని, ఎన్నో పాఠాల్ని అందరికీ పంచేసి వెళ్లిపోయారు. 

అయినా మాకు, మనందరికీ చెప్పినవన్నీ గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళటానికి ప్రయత్నిస్తామని, అలాగే వెళ్తామని ఆశిస్తున్నాము.  అలాగే వెళ్లాలని వారు పైనుంచి మనందరినీ ఆశీర్వదించాలి అని కోరుకుంటూ…పాట ఎక్కడున్నా బాలు గారు అక్కడే వుంటారు అని తమ స్పందనను తెలియచేసారు.

అలాగే “వయ్యారి గోదారమ్మా..ఒళ్ళంతా ఎందుకమ్మా కలవరం… కడలి ఒడిలో కలిసిపోతే కల వరం ” అనే ఒక మంచి పాటను పాడి వీక్షకులను ఆనందింపచేసారు మల్లికార్జున్, గోపిక పూర్ణిమ.

స్వర రాగ గీతం కార్యక్రమం ఇంతగా మీ అందరి ఆదరాభిమానాలు పొందడానికి ఇంకొక కారణం నా టీంలోని ఇద్దరు ఇంపార్టెంట్ టెక్నిషన్స్. ఒకరు మా కీర్తన డిజిటల్ రికార్డింగ్ స్టూడియో సౌండ్ ఇంజనీర్ సాయి మనోహర్ దుబ్బాక.  ఇతను వయసులో చిన్నవాడైన ప్రతిభలో చాలా పెద్దవాడు. ఎందుకంటే సింగెర్స్ అందరూ యూస్ లో డిఫరెంట్ స్టేట్స్ లో వున్నారు. మా ముజిషన్స్ విజయనగరం, విశాఖపట్నంలో వున్నారు. నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాను. మేమందరం అందించిన పదార్థాలు తీసుకొని ఒక మంచి వంటకం  వండి మీ వీనులకు విందు చేశారు సాయి మనోహర్. 

అలాగే ఇంకొక ఇంపార్టెంట్  టెక్నీషియన్, ఎడిటర్ శ్రీకాంత్ పూదరి. అసలైన కష్టం అంటే ఇతనిది.. ఇటు మేమిచ్చినటువంటి వీడియోలు, మా సాయి అందించినటువంటి ఆడియో, ముజిషన్స్ ఇచ్చిన  మ్యూజిక్ ట్రాక్ లను వీటన్నిటిని సమన్వయపరిచి,  అలాగే మంచి గ్రాఫిక్స్ తయారు చేసి, మంచి టెక్నికల్ వాల్యూస్ లను ఈ వీడియోస్ అన్నిటికీ ఆడ్ చేసి ఒక మంచి కార్యక్రమాన్ని మీకు అందించడంలో అత్యంత ప్రతిభ కనబరచిన ఎడిటర్ మా శ్రీకాంత్ పూదరి వీళ్ళిద్దరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మౌన ప్రేమను ఆర్టిస్టిక్ గా చెప్పాలి అన్నప్పుడు కళాతపస్వి చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం పాటే.  విశ్వనాధ్ గారు ఊహించిన సన్నివేశానికి వేటూరి కలం తోడైతే రేపల్లె యద ఝల్లుమంటుంది. యమునాతీరం, మురళీరవం నర్తన సరళి, మువ్వల రవళి ఇవన్నీ పదచిత్రాలవుతాయి. వీటి నేపథ్యంలో బాలుగారి గుండె గొంతులా మారిపోతుంది.

అనగల రాగాన్ని, కాదనలేని అనురాగాన్ని అద్భుతంగా పలికిస్తుంది. వేటూరి, మహదేవనుల సృజనలో సంగీత నాట్యాల సంగమ హృది, సప్తపది సినిమాలోని “రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి నవరస మురళి ఆ నందన మురళి ఇదేనా ఇదేనా ఆ మురళి మొహనమురళి” పాటని గాయని సుప్రజా కడగండ్ల ఎంతో మధురంగా, చక్కగా పాడి వీక్షకుల హృదయాలను ఆనందింపచేసి అమితంగా ఆకట్టుకుంది.

స్వర రాగ గీతం కార్యక్రమంలో ఇప్పుడు ఒక విశిష్ట అతిథి బాలు గారితో తనకున్న అనుబంధాన్ని గురించి మీతో మాట్లాడ బోతున్నారు.

దాదాపు 30-35 సంవత్సరాల క్రితమే బాలు గారు రోజుకు 10 పాటలు రికార్డు చేసే అటువంటి బిజీలో వున్న సమయంలోనే ఈయన సినీ సంగీత రంగప్రవేశం చేసి ఆయనకు ధీటుగా నిలిచి దాదాపు పదకొండు భాషల్లో 25 వేల పైచిలుకు పాటలు పడినటువంటి సంగీత దిగ్గజం శ్రీ మనో (నాగూర్ బాబు). మనో గారు నాకు ఆల్ ఇండియా రేడియో తెలీదు మా బాల్ ఇండియా రేడియో మాత్రమే…. బాలు ఇండియా రేడియో మాత్రమే తెలుసు అంటూ బాలు గారు వెన్నంటే ఉండి ఆయనతో మూడున్నర దశాబ్దాల పాటు ప్రయాణం చేసి అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తి అద్భుతమైన గాయకుడూ శ్రీ మనో గారు బాలు గారి గురించి, స్వర రాగ గీతం కార్యక్రమాన్ని గురించి తమ భావాలను మీతో పంచుకుంటారు.

మనో గారు తన స్పందనను తెలియచేస్తూ…..

సంగీత ప్రియులందరికి, సంగీతాన్ని ఆస్వాదించేవారికి,    సంగీతమే ఊపిరిగా ఉన్నటువంటి  ప్రతి హృదయానికి మీ నాగూర్ బాబు నమస్కారం. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం స్వర రాగ గీతం. అది అమెరికాలో, ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గాయని గాయకులు, మన పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా పరిచయమై అన్నయ  ఆశీస్సులతో ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి ఆశీస్సులతో మరి ఇంత జర్నీ చేస్తూ…ఆ తర్వాత తరాన్ని కూడా తయారు చేసే ఒక మంచి ఉద్దేశంతో ఎన్నో మంచి కార్యక్రమాలు ఎంతో మందికి చదువు… విద్యాదానం… అన్నదానం ఇలాగా వాళ్ళకి లేని వాళ్ళకి మేమున్నామంటూ స్వర వేదిక ద్వారా వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను.  తమ్ముడు పార్థు చెప్పిన వెంటనే ఎంతో ఆనందం కలిగింది.  ఈ సంచిక ద్వారా 10 – 15 రాగాలు తీసుకొని స్వర రాగ గీతం కార్యక్రమం అందరు కూడా తెలుగు మాత్రమే కాకుండా ఎన్నో భాషలకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అవ్వనివండి,  పాటలు కనివండి, త్యాగయ్య కాలం నుంచి, సెమి క్లాసికల్,  సినిమా, లలిత కళలు, లలిత సంగీతం, మీకు  గజల్స్ కనివండి,  జానపదాలు కానివండి  అన్ని కూడా మనకి ఒక రాగం బేస్డ్ గా ఉంటాయి. ఒక రాగానికి  సంబంధించి ఎన్ని రకాల వేరియేషన్స్, ఎన్ని జోనర్స్ ఉంటాయనేది  చెప్పకనే వాళ్లందరికీ దాని మీద మక్కువ కలిగిస్తూ.  వాళ్ళందర్నీ ఎడ్యుకేట్ చేస్తూ, సంగీతం ఎంత అవసరం మనకి అని ముఖ్య ఉద్దేశంగా పెట్టుకొని,  ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మా అన్నయ్య…. మన అన్నయ్య ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఆయన గంధర్వ అంశం, ఆ మహానుభావుడికి ట్రిబ్యూట్ ఇచ్చే ఒక కార్యక్రమం, దీని  ద్వారా జరుపుతున్నందుకు, ముక్యంగా పార్థు ని,  అతనికి సహాయం చేస్తున్నటువంటి మిగతా స్వర వేదిక మెంబర్స్ అందరికీ,  ఇక్కడ ఉన్న మిగతా స్నేహితులకి, మ్యూజిషియన్స్  అందరికి కూడా నేను నమస్కరిస్తున్నాను.  చాలా గొప్ప కార్యక్రమం.  మేము కూడా సంగీతం ఉంటేనే ఇంత కాలం సినిమాల్లో ప్రయాణం చేయగలిగాము, అనటానికి తార్కాణం, నేను కూడా అందులో వున్నాను. నేను కూడా రేవతి రత్న స్వామి గారి దగ్గర, నేదునూరి కృష్ణమూర్తి గారి దెగ్గర సంగీతం వోకల్ కొన్ని సంవత్సరాలు నేర్చుకున్నాను కాబట్టే స్వరం మీద ఒక అవగాహన వచ్చింది. ఆ స్వరం నేర్చుకోవడం వల్లన పాటను ఎంత ఈజీగా పాడగలం, ఒక రాగం తెలియడం వల్ల ఆ కమాండింగ్ ఎంత సౌరభ్యంగా ఉంటుంది, సంగీతం తెలిసినందువల్ల అనటానికి , మరి నేర్చుకొని వచ్చినందువలనే నాకు ఆ  సరస్వతి దేవి తల్లి భోజనం పెడుతోంది. మీలో ఉన్నటువంటి ఆ మూసికాలిటీ పెంచుకోవాలంటే, సంగీతం మీద ప్రేమ అది మీలో ఉన్నటువంటి టాలెంట్ బయటికి రావాలంటే 100% సంగీతం మీద దృష్టి పెట్టండి. అది ఒక బేస్ మీరు తయారుచేసుకుంటే, ఫౌండేషన్ దాని తర్వాత ఎటువంటి పాటైనా  మీరు ఆనందంగా అవలీలగా  పార్థు లాంటి గురువు చూపిన మార్గంలో ప్రయాణిస్తూ చక్కగా నేర్చుకోవచ్చు. మరి అందరూ కూడా సంగీత అభిమానులు అందరూ కూడా ఇలాంటి ప్రయత్నాన్ని ఆదరిస్తారని మనసారా కోరుకుంటూ థాంక్యూ సో మచ్ మీ నాగూర్ బాబు నమస్కారం అంటూ మనో (నాగూర్ బాబు) తన స్పందనను ఎంతో చక్కగా తెలియచేసారు.

ఆ తరువాత ఒక అద్భుతమైన పాట ” జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసి స్వర్గాదపీ గరీయసి ఏ తల్లి నిను కన్నదో ఏ తల్లి నిను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసి స్వర్గాదపీ గరీయసి ” అని అద్భుతంగా పాడి వీక్షకుల హృదయాలను అమితంగా ఆకట్టుకున్నారు మనో.

స్వర రాగ గీతం కార్యక్రమంలో రాగాల ఎంపికలు పాటలు సెలక్షన్స్లో అలాగే ఆడియో రికార్డింగ్ లో ఇతర టెక్నికల్ వ్యవహారాల్లో నాకు ఎంతో సహకరించిన అటువంటి నా మిత్రులు మల్లికార్జున్, గోపిక పూర్ణిమ గార్లకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 

అలాగే హిందీ పాటలు ఏవి పాడాలి అన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా ఈ హిందీ పాటలు  రీసెర్చ్ చేసి  నాకు చాలా హెల్ప్ చేసినటువంటి శ్రీమతి శుబ్రవేటి ఉమాదేవి గారు ఢిల్లీలో ఉంటారు మా పిన్ని గారు వీరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

అలాగే  రాగం, నెక్స్ట్ రాగం ఏంటి, ఆ నెక్స్ట్ రాగం ఏంటి, అని అడుగుతూ ఎంతో ప్రోత్సహించి, రీసెర్చ్ చేసి, మంచి మంచి ఎన్నో పాటలను సజెస్ట్ చేసినటువంటి మా నాన్నగారు శ్రీ నేమాని రామం గారికి కూడా కృత్తజ్ఞతలు తెలియచేస్తున్నాను.

లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఇప్పుడు ఈ ఫ్లోర్,  అంటే ఈ ఇల్లే నా ఫ్లోర్…

ఇంట్లోంనించే  పనిచేస్తున్నాము ఆరు నెలల నుంచి. ఇంట్లో నుంచే పాటలు పాడుతున్నాము, ఇంట్లో నుంచే షూటింగ్ చేస్తున్నాము, మాములుగా మేము షూటింగ్ చేస్తున్నపుడు  కెమెరామెన్ వేరేగా ఉంటారు,    ప్రొడక్షన్ వాళ్లు వేరే ఉంటారు, మేకప్ వేసే వాళ్ళు వేరే ఉంటారు, కాఫీ ఇచ్చేవారు వేరే వుంటారు, ఇవన్నీ అన్నీ తానే అయి నాకు సహకరించినఅటువంటి నా కుటుంబ సభ్యులు మా శ్రీమతి కృష్ణప్రియ, అలాగే మా పిల్లలు కశ్యప్ అండ్ గౌతమ్

వీళ్ళకి థాంక్స్  చెప్పకూడదు, బట్ దే అర్ విత్ మీ విత్ త్రు అవుట్ థిస్ జర్నీ… ఐ అం గ్రేట్ ఫుల్ టు థెం,  థాంక్యూ సోమచ్.  ఇంతమంది సహకరించారు కాబట్టే స్వర రాగ గీతం ఇంతటి ఘనవిజయాన్ని సాధించిందని ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాను.. 

ఎందుకంటే ఇవాళ పొద్దున్న వీరభద్రం గారు నాకు ఈ స్టాటిస్టిక్స్ పంపించారు. నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ప్రతి వారం ఏ వారం ఆ వారం పనిచేసుకుంటూ పోవడం వలన దీనిపై ద్రుష్టి పెట్టలేదు. 

ఈ స్టాటిస్టిక్స్  మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే  వీటన్నిటికీ కారణం మీరే గనక.  25 ఎపిసోడ్ 25 సంచికలు,  63 మంది సింగర్లు,  200కు పైగా పాటలు అంటే శాస్త్రీయ సంగీత కీర్తనలు,  తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సినిమా పాటలు, లలిత గీతాలు, కొన్ని గజల్స్  ఆలా 200కు పైగా పాటలు, 600K (థౌసండ్స్) వ్యూస్,  54000 హావర్స్ అఫ్ వాచింగ్ ఇంతకన్నా ఈ కార్యక్రమం ఇంతమందిని ఆనందింప చేసింది  అనడానికి నిదర్శనం ఏమి కావాలి. ముఖ్యంగా మీ అందరికీ ఈ కార్యక్రమానికి విజయాన్ని చేకూర్చినందుకు  మీ అందరికీ మా అందరి తరఫున శిరస్సువంచి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

పార్థు తన వాఖ్యానాన్ని కొనసాగిస్తూ… బాలు గారు మన అందరికీ భౌతికంగా దూరం అయ్యాక కోట్లాది మంది అభిమానులు ప్రజలు వారి బాధని వారి ప్రేమని మాటల్లో పాటల్లో తమ  వ్యాసాల్లో రకరకాలుగా వ్యక్తపరిచారు. నేను వాటిల్లో చాలా వాటిని విన్నాను చాలా చదివాను. నాకు బాగా నచ్చిన ఒక వ్యాసంలో కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. గుంటూరులో సంస్కృతి అనే ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు శ్రీ బాలచందర్ గారు ఇలా రాసుకున్నారు…

బాలు గారు శివైక్యం చెందారని వార్త తరువాత ఆయనకి పోతన మహాభాగవతంలోని ఒక పద్యం గుర్తొచ్చింది “మన సారధి, మన సచివుడు, మన వీయము, మన సఖుండు, మన బాంధవుడున్, మన విభుడు, గురువు, దేవర మనలను విడనాడి చనియే మనుజాధీశా” అనే పద్యాన్ని పాడి వినిపించి ఆకట్టుకున్నాడు పార్థు.  

కృష్ణుడు అవతారం ముగించుకుని వెళ్ళిన తర్వాత కృష్ణుడు మన అందరినీ విడిచి వెళ్లిపోయాడు అని ఎంతో బాధతో అర్జునుడు ధర్మరాజుకు  చెప్పిన సందర్భంలో పోతనగారు రచించినటువంటి పద్యమిది. ఇందులోని చెప్పిన చుట్టరికాలు అన్నీ కూడా  మనకి ,బాలుగారికి  సరిగ్గా సరిపోతాయి. ఎందుకంటే ఎంతోమంది గాయని గాయకులకు మార్గ నిర్దేశం చేసిన గురువు, అలాగే ఆయన వాళ్ళ జీవితాలు నడిపించిన అటువంటి సారథి. తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూతోను ఎంతో సన్నిహితగా వెలిగి, స్థాయిని భట్టిని కాకుండా మనిషిని మనిషిగా గౌరవించి,  స్నేహానికి నిర్వచనం చెప్పినటువంటి మంచి మిత్రుడు. ఎంతోమందికి పరోపకారం చేసినటువంటి ఎన్నో దానాలు చేసినటువంటి గొప్ప వ్యక్తిత్వం బాలు గారిది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పద్యంలోని ప్రతి విశేషణము ఆయనకి వర్తిస్తుందని చెప్పొచ్చు. అందుకే అటు దుర్యోధనుడుతోను, ధర్మరాజుతోను ఏక కాలంలో స్నేహాన్ని నడపగల   మంచి మిత్రుడు మా తమ్ముడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అని కళాతపస్వి కె.విశ్వనాథ్ గారు అన్న మాటను నిజం చేసిన అజాతశత్రువు మన బాలు గారు.

అందుకే బాలు గారు… మీ స్వరమే కాదండి… మీ మాట, మీ పాట, మీ వ్యక్తిత్వం, మీ స్నేహశీలత, మీ దాన గుణం ఇవన్నీ ఎందుకు, అచ్చంగా, పూర్తిగా మీరే మా వరం… అని ఎంతో ఆప్యాయంగా, వినయపూర్వకంగా చెప్పారు పార్థు..

“గా మా నీ గమగస మగస గస నీసానిదమగ దమగ మగ సరీసానీ గమగనీ గమాగ మదామ దనీద  నిసానిరీ వేదం అణువణువున నాదం వేదం అణువణువున నాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై వేదం వేదం అణువణువున నాదం ” అని ఎంతో అత్యద్భుతంగా పాడి వీక్షకులకు వీనులవిందు చేసారు గాయకుడు పార్థు నేమాని.

ఈ పాట చివరలో పాడిన శ్లోకానికి అర్థాన్ని పార్థు వివరిస్తూ… అర్థం ఏమిటంటే రససిద్ధులైన కవీశ్వరులుకు జననమరణాలు గురించి భయం ఉండదు వారు చరిత్ర లో చిరస్థాయిగా నిలిచిపోతారని. ఈ మాట మన బాలు గారికి కూడా వర్తిస్తుంది కదూ.

కార్యక్రమాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ఈ కార్యక్రమాన్ని చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన స్వర వేదిక సంస్థకీ మరొక్కసారి శిరసు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ దేవుడి అనుగ్రహం ఉంటే స్వర వేదిక ప్రోత్సాహం ఉంటే బాలు గారి ఆశీర్వాదం ఉంటే మీరంతా వెన్నంటి ఉంటాం అంటే స్వర రాగ గీతం సీజన్ టు తో మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తానని మాటిస్తున్నాను అంతవరకు సెలవు మరి ధన్యవాదాలు తెలియచేస్తూ స్వర వేదిక, కీర్తన అకాడమీ అఫ్ మ్యూజిక్ సంయుక్త నిర్వహణలో ఎపిసోడ్-25తో  “స్వర” మధురంగా, ఘనంగా స్వర రాగ గీతం సీజన్ – 1 కార్యక్రమం ముగించారు ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, వ్యాఖ్యాత, కార్యక్రమం నిర్వాహకుడు, పార్థసారథి నేమాని (పార్థు).

సర్వేజనా సుఖినోభవంతు

సిన్సియర్ థాంక్స్ టు స్వర వేదిక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కమలాకర్ కనజం చైర్మన్, భద్రం దంతుర్తి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కృష్ణ అనుమోలు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అఖిల మమందుర్,  శారద కడగండ్ల, ప్రియా కనజం, రవి తాత, అభిజిత్ వేములపాటి, మాధవ్ దంతుర్తి ప్రెసిడెంట్, సుప్రజా కడగండ్ల వైస్ ప్రెసిడెంట్, రిషిల్ మంత్రిప్రగడ సెక్రటరీ, భావన రవిచంద్రన్ డైరెక్టర్ చారిటి మానేజ్మెంట్, నిధి రావు డైరెక్టర్ ప్రోగ్రాం మేనేజ్ మెంట్, కృష్ణప్రియ తిరుమల డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్.

“స్వరవేదిక”, కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఆన్లైన్లో (యూట్యూబ్ ద్వారా) ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్న “స్వర రాగ గీతం” కార్యక్రమంలోని ప్రతీ ఎపిసోడ్ కి సంబంధించిన అంశాలను, విశేషాలను అక్షరరూపంలో మీ ముందు ఉంచడానికి ఓ చిరుప్రయత్నం చేస్తున్నది మీ…. కళావైభవం.కామ్ / www.kalavaibhavam.com  – కే.ఎల్. నరసింహా రావు (K.L. Narasimha Rao – KLN)

Volunteer Technical Support: Shaliny Jadhav, Minnesota, USA

 

 

 

Print Friendly, PDF & Email
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *