Breaking News

Arts and Culture, Festivals and Traditions, General News - ఇతర వార్తలు మిత్రులు, శ్రేయోభిలాషులందరికి భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు – Kalavaibhavam.com

Tuesday 18 - 01 - 2022

వీక్షకుల హృదయాలను రంజింపచేసిన అంబ వాణి “కీరవాణి” రాగాలాపన – స్వర వేదిక, కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న స్వర రాగ గీతం ఈనాటి ఎపిసోడ్-20 లో “కీరవాణి” రాగం  రెండవ సంచిక

image_print

వీక్షకుల హృదయాలను రంజింపచేసిన అంబ వాణికీరవాణిరాగాలాపన  

స్వర వేదిక, కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న స్వర రాగ గీతం ఈనాటి ఎపిసోడ్-20 లోకీరవాణిరాగం  రెండవ సంచిక

Swara Raga Geetham “Keeravani Ragam” Part-2, Episode 20 (31.10.2020) 

స్వర వేదిక, కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ఈనాటి స్వర రాగ గీతం అంబ వాణి ” కీరవాణి ” రాగం రెండవ సంచిక, ఎపిసోడ్ 20 కార్యక్రమానికి స్వాగతం పలికారు ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, వ్యాఖ్యాత, కార్యక్రమం నిర్వాహకుడు పార్థసారథి నేమాని (పార్థు).

కార్యక్రమం ఎపిసోడుని స్పాన్సర్ చేసిన వారు కాంచ్ టెక్నాలజీస్ (Conch Technologies), మధు మారేడు & పూర్ణ పెరవలి and Kutir.com

 

కీరవాణి రాగం:

ఆరోహణ: స రి గ మ ప ద ని స  – SA RI GA MA PA DA NI ṠA   

అవరోహణ: స ని ద ప మ గ రి స – SA NI DA PA MA GA RI SA

కీరవాణి రాగంలోని స్వర స్థానాలు

స  SA – షడ్జమం Shadjamam

రి  RI – చతుశ్రుతి రిషభము Chatusruthi Rishabham

గ  GA – సాధారణ గాంధారం Sadharana Gaandhaaram

మ MA – శుద్ధ మధ్యమం  Shuddha Madhyamam

ప  PA – పంచమం PANCHAMAM

ద DA – శుద్ధ దైవతం Shuddha Daivatham

ని NI – కాకలి నిషాదం Kakali Nishadam

స  SA – షడ్జమం  Shadjamam

అవరోహణలో కూడా ఇవే స్వరస్థానాలు వస్తాయి. 

స్వరవేదిక సమర్పిస్తున్న ఈ స్వర రాగ గీతం కార్యక్రమంలో కీరవాణి రాగం రెండవ సంచికకి మీ అందరికీ స్వాగతం పలుకుతూ… “ఎన్నడు పక్వము గా దిదె యింద్రియభోగంబులచే.. సన్నము దొడ్డును దోచీ సంసారఫలంబు” మానవుడి సంసార జీవితాన్ని ఒక పండుతో పోలుస్తూ,….ఈ పండు మధురమైన ఫలముగా పరిపక్వత చెందాలి అంటే ఆచార్యుని ద్వారా శ్రీ వేంకటేశ్వరుని పాదాల చెంత సమర్పించడం ఒక్కటే మార్గమని అన్నమాచార్యులవారు ఈ కీర్తనలో మనకు ఉపదేశిస్తున్నారు.

తిరుమల దేవస్థానం వారి ఎస్ వి  రికార్డింగ్ ప్రాజెక్టు కోసం ఈ కీర్తనను కీరవాణి రాగంలో స్వరపరిచిన అదృష్టం నాకు దక్కింది. ఈ అద్భుతమైన  కీర్తన “”ఎన్నడు పక్వము గా దిదె యింద్రియభోగంబులచే.. సన్నము దొడ్డును దోచీ సంసారఫలంబు” ను ఎంతో చక్కగా పాడి వినిపించి ఈనాటి కీరవాణి రెండవ సంచికను అద్భుతంగా  ప్రారంభించారు ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, వ్యాఖ్యాత, కార్యక్రమం నిర్వాహకుడు, పార్థసారథి నేమాని (పార్థు).

సిరి సంపదల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు దేనికైనా రాసిపెట్టి ఉండాలి, పెట్టి పుట్టుండాలి అని మనం చెప్పుకుంటాము. కానీ త్యాగరాజ స్వామి వారికి కావాల్సిన మాత్రం ఇది కాదు. ఆయనకు కావలసింది శ్రీరామచంద్రుని పాదాల మీద చెక్కుచెదరని అచంచలమైన భక్తి. అది  వుంటే అన్నీ ఉన్నట్లే అని వారి భావన.

కీరవాణి రాగంలో త్యాగరాజ స్వామి వారి “కలిగియుంటే గదా కల్గును కామిత ఫల దాయక…. కలినియింగితమెరుగక నిన్నాడుకొంటి చలము చేయక నా తలను చక్కని వ్రాత” అని గాయని శ్రీ చందన అనుమోలు హృదయవాణిని వినిపించి, భక్తి పారవశ్యంలో ఓలలాడించింది.

ప్రఖ్యాత దర్శకులు వంశీ గారు మనందరం ముద్దుగా పెద్ద వంశీ గారు అని పిలుచుకుంటాం. వీరి  డైరెక్షన్లో 1988 లో వచ్చిన మహర్షి సినిమాలో ఉన్న పాటలన్ని ఇప్పటికీ ఎప్పటికీ మ్యూజిక్ లవర్స్ అందరిని  అలరిస్తూఉంటాయి. ఈ సినిమాలో ప్రఖ్యాత రచయిత వెన్నెలకంటిగారు రాసిన ఒక పాటను మాస్ట్రో ఇళయరాజా గారు కీరవాణి లో స్వరపరిచారు. మాటరాని మౌనమిది… మౌనవీణ గానమిది… అని పార్థు ఎంతో మధురంగా పాడి అలరించారు.

ఈ పాటలో ఒక విశేషాన్ని చెపుతూ…ఈ పాటలో సాహిత్యాన్ని గమనిస్తే…..తెలుగు సాహిత్యంలో ఒక పద్యంగాని, ఒక పాటనుగాని తీసుకుంటే ఒక లైన్  ఏ పదంతో ఎండ్ అవుతుందో ..రెండో లైన్ కూడా అదే పాదంతో మొదలవుతుంది. ఇది ముక్తపదగ్రస్తం ఈ ప్రక్రియలో వెన్నెలకంటి గారు ఈ పాటలోని పల్లవిని అత్యద్భుతంగా రచించారు.

అన్వేషణ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో థ్రిల్, క్రైమ్, సస్పెన్స్, మిస్టరీ, డిటెక్షన్ ఇవన్నీటికీ ఒక మంచి మ్యూజిక్ యాడ్ చేస్తే అదే అన్వేషణ సినిమా. 1985లో రిలీజ్ అయిన ఈ సినిమాకి కూడా పెద్ద వంశీ గారే దర్శకుడు. ఈ సినిమాలో మాస్ట్రో ఇళయరాగా గారు కీరవాణిరాగంలో ఒక ట్యూన్ ని కంపోజ్ చేస్తే, సంగీత పరిజ్ఞానం పుష్కలంగా ఉన్నా వేటూరి సాహితీ సుందరరామమూర్తి గారు ఈ పాట పల్లవిని కూడా కీరవాణి అంటూనే  మొదలు పెట్టారు. 

 

నాకు తెలిసి కీరవాణి రాగంలో వచ్చిన తెలుగు సినిమా పాటలు అన్నిటిలోనూ మోస్ట్ పాపులర్ సాంగ్ “కీరవాణి…చిలకలా కొలికెరొ పాడవేమే వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగ అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధురసవాణి కీరవాణి…. చిలకలా కొలికెరొ పాడవేమే  వలపులే తెలుపగా” అని ఈ పాటను గాయనీగాయకులు విజయ్ రామసుబ్రమణియన్, శృతి నందూరి ఎంతో చక్కగా పాడి ప్రేక్షకుల హృదయాలను రంజింపచేసారు. 

పరమాత్మ దర్శనం పొందగలిగే ఏకైక అవకాశం మానవ జన్మకి మాత్రమే ఉంటుంది. మానవునిగా జన్మించి తరించాలని దేవతలు సైతం తపిస్తారని పెద్దలమాట. అటువంటి ఉత్కృష్టమైన మానవజన్మను కోదండ రాముని గురించి వెచ్చించు, కోరికల వైపు మళ్ళించకు అని వాగ్గేయకారుడైన తూము నరసింహ దాసు గారి మాట. అటువంటి కీర్తనను కీరవాణి రాగంలో స్వరపరిచిన ఈ భాగ్యం నాకు దక్కిందని పార్థు వివరించారు. ఈ కీర్తన “జన్మ మేలనే వృధా జన్మ మేలనే” అని గాయని మాన్య గుమ్మరాజు ఎంతో చక్కగా పాడి భక్తి పారవశ్యంలో పరవశించేటట్టు చేసింది.

2001 వెంకటేష్ గారు హీరోగా కె.విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా నువ్వు నాకు నచ్చావ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తన సంభాషణలతో స్టార్ ఇమేజ్ ఉన్న వెంకటేష్ గారితో కూడా అత్యద్భుతమైన హాస్యరసాన్ని పంపించారు ఈ సినిమాలో సాంగ్స్ అన్ని కూడా చాలా పాపులర్ అయ్యాయి. ఈ సినిమాలోని రెండు పాటలను కోటిగారు కీరవాణి రాగంలో, కీరవాణి రాగచ్ఛయాలలో స్వరపరిచారు. ఈ సినిమాలోని ఒక పల్లవి వినిపించి పార్థు ఆకట్టుకున్నారు.

 

పాట కేవలం పాటల కోసమని కాకుండా పాత్రల్లోవున్న సైకాలజీని తేలికైన మాటలలో చెప్తే వినేవాళ్ళు కూడా చక్కగా రిసీవ్ చేసుకుంటారు.  నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో హీరోయిన్ ఒక టిపికల్ క్యారెక్టర్. ఉన్న మాట చెప్పనీయదు, అలాని ఊరుకుంటే ఒప్పుకోదు. ఈ విషయాన్ని సిరివెన్నెల గారు ఈ పాటలో చక్కగా వివరించారు.  కోటిగారు కూడా ఈ పాటని కీరవాణి రాగంలో ఎంతో మెలోడియస్ గా కంపోజ్ చేసారు. కీరవాణి రాగచ్చాయలలో ఎందుకంటే చరణంలో రెండు చోట్ల అన్యస్వర ప్రయోగాలు కూడా జరిగాయి.

ఈ సినిమాలో “ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగె సత్యభామ నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నీవు దాచలేవు ఏమి చేయనయ్యొ రామ అన్నుకున్నా తప్పు కదా మోమాటం ముప్పుకదా మనసైతే ఉంది కదా మనమాటెం వినదు కదా పంతం మానుకో భయం దేనికో” అనే ఈ  హుషారైన పాటను గాయనీగాయకులు హర్షిత వంగవీటి, సాయివచన్ పొన్నపల్లి చాలా చక్కగా, హుషారుగా పాడి అలరించారు.

ఇన్నిసై పాడివరుం. 1999లో రిలీజ్ అయిన తూళ్లదా మనముం తుళ్ళుమ్  సినిమా కోసం వైరముత్తు గారు  రాసిన ఒక సూపర్ హిట్ తమిళ్ సాంగ్ ఇది. ఈ పాటని ఎస్.ఏ. రాజ్ కుమార్ గారు కీరవాణి రాగచ్చాయాలలో స్వరపరిచారు. ఈ సినిమా ఇయర్ 2000 లో నాగార్జున గారు హీరోగా నువ్వు వస్తావని అనే పేరుతో తెలుగులో రీమేక్ చేయబడింది. “పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి” అంటూ సిరివెన్నెల గారు  రాసిన ఈ పాట తెలుగులో కూడా చాలా పాపులర్ అయింది.

ఇప్పుడు ఆ పాటని గాలి ఎలా మోసుకెళ్ళిందో తమిళ భాషలో కీరవాణి రాగంలో “ఇన్నిసై పాడి వరుమ్ ఇలాంకాట్రుకు ఉరువమిల్లై కాట్రాలై ఇల్లై ఎండ్రాల్ ఓరు పాఠోళీ కేట్పాదిల్లై” అని తమిళ్ లో ఎంతో చక్కగా పాడి, వివరించిన గాయని భావన రవిచంద్రన్ ఎంతో అమితంగా ఆకట్టుకుని అలరించింది.

ఇప్పుడు రాగ్ కీరవాణి లో వచ్చిన ఒక మోస్ట్ పాపులర్ హిందీ పల్లవి మీ కోసం… 1977 లో రిలీజ్ అయిన స్వామి సినిమా కోసం అమిత్ కన్నాజీ రచించిన ఈ మార్వలెస్ మెలోడీ ని రాజేష్ రోషన్ గారు, రాగ్ కీరవాణి లో ట్యూన్ చేస్తే మన యేసు దాసు గారు ఎంతో హృద్యంగా పాడారు. ఈ పాటను పార్థు ఎంతో చక్కగా పాడి వినిపించారు.

మన కళ్ళకు ఎదురుగా ఉన్న వాటిని మనం నేకేడ్ ఐతో చూస్తాం. ఏదైనా కొంచం ప్రాబ్లెమ్ ఉందనుకోండి కళ్లద్దాలు పెట్టుకుంటాం. ఇంకా చిన్నవనుకోండి  మైక్రోస్కోపులో చూస్తాం. కానీ గుండెల్లో ఉన్న కత్తికోతను చూడాలంటే మాత్రం కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడాలంట. ఇది సిరివెన్నెల గారి మాట.

2000లో వచ్చిన “నువ్వేకావాలి” సినిమాలో ” కళ్ళలోకి కళ్ళుపెట్టి చూడవెందుకు”  సిరివెన్నలగారు రచించిన ఈ పాటని ,  కోటి గారు కీరవాణి రాగంలో కంపోజ్ చేస్తే చిత్ర గారు పాడిన ఈ పాట “కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కొత పొల్చుకుందుకు” అని గాయని మహిత బీరం ఎంతో ఆర్ద్రతతో  పాడి అమితంగా ఆకట్టుకున్నారు. 

ఇప్పుడు మనం కీరవాణి రాగం లో క్లైమాక్స్ సీన్కి చేరుకున్నాం. ఇప్పుడు మీకు  వినిపించబోయే పాట కూడ అలాంటిదే మరి. “ఓ పపా లాలి” సినిమాలో హీరోయిన్ బాలు గారికి ఒక్కగుక్కలో చరణం ఊపిరి తీసుకోకుండా పాడగలవా అని ఒక ఛాలెంజ్ విసిరితే… ఇళయరాజా గారు చేసిన ఈ అద్భుతమైన కంపోసిషన్ ని మా బాస్ మా గురువుగారు బాలు గారు అద్భుతంగా స్వీకరించి ఆయనే పాడి, ఆయన నటించి మెప్పించారు.

ఒకసారి ఆ పల్లవేంటో, ఆ చరణమేంటో, ఆ సంగతేంటో విందామా అని పార్థు “మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచె జ్ఞాపకాలురా రేగే మూగ తలపె వలపు పంట రా” అని ఎంతో అద్భుతంగా పాడి వినిపించి, అలరించి ఎంతగానో ఆకట్టుకున్నారు.

సో విన్నారు కదా హీరోయిన్ విసిరిన ఈ ఛాలెంజ్ ని బాలుగారు అక్సెప్ట్ చేసి ఒకే ఒక్క గుక్కలో ఊపిరి తీసుకోకుండా చరణం పాడారు.  నేను కూడా అలాగే పాడటానికి ప్రయత్నం చేశాను. అయితే ఇది మేము జనరల్ గా టెక్నాలజీని వాడుకుని ఈ ప్రయోగం చేస్తూవుంటాము. హ్యూమన్న్లీ కొంచెం డిఫికల్ట్ టాస్క్ ఇది.

ఇన్ఫాక్ట్ శంకర్ మహదేవన్ గారి మోస్ట్ పాపులర్ బ్రీత్లెస్ సాంగ్ దగ్గరి నుంచి నేను కూడా ఒక ఆంజనేయ దండకం పాడడం జరిగింది. అది  నాలుగు నిమిషాల బ్రీత్లెస్ దండకం. అది  చాల పాపులర్ ఇప్పటికి టివిలో అది  ప్రసారం అవుతూ ఉంటుంది.  మేము ఈ టెక్నాలజీ ని యూస్ చేసుకుని ఒక చిన్న ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ ని క్రియేట్ చేయడానికి మాత్రం ఆ ప్రయత్నం చేస్తూఉంటాం.

సో అది కీరవాణి రాగాలాపన కి సంబంధించిన విశేషాలు. మిమ్మల్నదరిని అలరించాయి అని ఆశిస్తూ వచ్చేవారం మరొక రాగంతో కలుద్దాము….   అంతవరకూ సెలవా మరి… అని ఈ నాటి కీరవాణి రెండవ సంచికని ఎంతో చక్కగా ముగించారు వ్యాఖ్యాత, గాయకుడు, కార్యక్రమం నిర్వాహకుడు పార్థసారధి నేమాని (పార్థు).

“స్వరవేదిక”, కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఆన్లైన్లో (యూట్యూబ్ ద్వారా) ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్న “స్వర రాగ గీతం” కార్యక్రమంలోని ప్రతీ ఎపిసోడ్ కి సంబంధించిన అంశాలను, విశేషాలను అక్షరరూపంలో మీ ముందు ఉంచడానికి ఓ చిరుప్రయత్నం చేస్తున్నది మీ…. కళావైభవం.కామ్ / www.kalavaibhavam.com  – కే.ఎల్. నరసింహా రావు

Volunteer Technical Support: Shaliny Jadhav, Minnesota, USA

 

 

 

image_print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×