Breaking News

Arts and Culture, Festivals and Traditions, General News - ఇతర వార్తలు మిత్రులు, శ్రేయోభిలాషులందరికి భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు – Kalavaibhavam.com

Tuesday 18 - 01 - 2022

ధీర “శంకరాభరణం” రాగం కొనసాగింపుగా అమితంగా ఆకట్టుకున్న పార్ట్-2 (రెండవ), ఎపిసోడ్-23 – స్వర రాగ గీతం ఈ సంచికలో ఎంతో మధురంగా, హాయిగా, హుషారుగా, ఎంతో చక్కగా వీక్షకుల  హృదయాలను రంజింపచేసింది ధీర “శంకరాభరణం” రాగాలాపన

image_print

ధీర “శంకరాభరణం” రాగం కొనసాగింపుగా అమితంగా ఆకట్టుకున్న పార్ట్-2 (రెండవ), ఎపిసోడ్-23

Swara Raga Geetham “Sankarabharanam Ragam” Part-2, Episode 23 (21.11.2020)

స్వర రాగ గీతం ఈ సంచికలో ఎంతో మధురంగా, హాయిగా, హుషారుగా, ఎంతో చక్కగా వీక్షకుల  హృదయాలను రంజింపచేసింది ధీర “శంకరాభరణం” రాగాలాపన

స్వర వేదిక, కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సంస్థలు సంయుక్తంగా సమర్పించిన ధీర “శంకరాభరణం” రాగం పార్ట్-2, ఎపిసోడ్ 23

స్వర వేదిక, కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న స్వర రాగ గీతం కార్యక్రమాన్ని, అభిమానించి, ఆదరిస్తున్న సంగీతాభిమాలనులందరికి స్వాగతం పలికారు ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, వ్యాఖ్యాత, కార్యక్రమం నిర్వాహకుడు, పార్థసారథి నేమాని (పార్థు)

ఈ కార్యక్రమం ఎపిసోడుని స్పాన్సర్ చేసిన వారు కాంచ్ టెక్నాలజీస్ (Conch Technologies), మధు మారేడు & పూర్ణ పెరవలి and Kutir.com

 

శంకరాభరణం రాగం:

ఆరోహణ: స రి గ మ ప ద ని స  – SA RI GA MA PA DA NI ṠA   

అవరోహణ: స ని ద ప మ గ రి స – SA NI DA PA MA GA RI SA

శంకరాభరణం రాగంలోని స్వర స్థానాలు

స  SA – షడ్జమం Shadjamam

రి  RI – చతుశ్రుతి రిషభము Chatusruthi Rishabham

గ  GA – అంతర గాంధారం Anthara Gaandhaaram

మ MA – శుద్ధ మధ్యమం  Shuddha Madhyamam

ప  PA – పంచమం PANCHAMAM

ద DA – చతుశ్రుతి దైవతం Chatusruthi Daivatham

ని NI – కాకలి నిషాదం Kakali Nishadam

స  SA – షడ్జమం  Shadjamam

అవరోహణలో కూడా ఇవే స్వరస్థానాలు వస్తాయి. 

ఒక మహాకవి అన్నట్టుగా అడుగులు రెండే కానీ నాట్యరూపాలు ఎన్నో, ఏ భాషలోనైనా అక్షరాలు కొన్నే కానీ అవి పలికించే భావాలు ఎన్నెన్నో, అలాగే సముద్రం లాంటి సంగీతంలో స్వరాలు ఏడే కానీ అవి సృష్టించిన రాగాలు ఎన్నెన్నో, అటువంటి రాగాలలో, అటువంటి అసంఖ్యాకమైన రాగాలలో కొన్నింటిని మాత్రమే మనం చర్చించుకుంటున్నాం, వాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం, వాటిని ఆస్వాదించడానికి ప్రయత్నం చేస్తున్నాం.  స్వర రాగ గీతం కార్యక్రమంలో శంకరాభరణం రెండవ సంచికకు

అందరికి మరొక్కసారి సుస్వాగతం పలికారు వ్యాఖ్యాత పార్థు.

ఇతరులకు నిను నెరుగతరమా…స్వామి శ్రీ వేంకటేశా… సామాన్యులకు నిన్ను తెలుసుకోవడం సాధ్యమవుతుందా… రాగభోగ విదూరులు, మహాయోగులు, పరమ భాగవతోత్తములు, స్థిరమైన మనసు కలిగినటువంటి వారు వీళ్ళకి మాత్రమే నిన్ను తెలుసుకోవడం సాధ్యమవుతుంది, కానీ నాలాంటి అల్పులకు  అది  సాధ్యం కాదు స్వామి అంటూ అన్నమాచార్యులవారు శ్రీ వేంకటేశ్వరుని వేడుకున్న కీర్తన ఇది.

ఈ కీర్తనను శంకరాభరణ రాగంలో ప్రముఖ సంగీత దర్శకులు నేమాని  సూర్యప్రకాష్ గారు స్వరపరచిన ఈ కీర్తనను మీకు వినిపించి ఈ సంచికను ప్రారంభించబోతున్నాను అని తెలియచేస్తూ… “ఇతరులకు నిను నెఱుగతరమా సతత సత్యవ్రతులు సంపూర్ణ మోహ విరహితులెఱుగుదురు నిన్ను నిందిరారమణా” అనే ఈ కీర్తనను ఎంతో అద్భుతంగా ఆలపించి ఈ సంచికకు చక్క టి శుభారంభాన్ని ఇచ్చారు గాయకులు పార్థు.

 

ప్రభు, భానుప్రియ హీరో హీరోయిన్లుగా 1993లో రిలీజ్ అయిన తమిళ సినిమా ” ఉళవన్ ” ఈ తమిళ మాటకు తెలుగులో రైతు అని అర్థం. ఊరంతా చులకన చేస్తే మానసికంగా కృంగిపోయిన ఒక యువకుడు ఒక విలేజ్ టీచర్ సహాయంతో తన ఆత్మవిశ్వాసాన్ని ఎలా కూడగట్టుకున్నాడు అనేది ఈ కథాంశం. ఇందులో ప్రముఖ రచయిత వాలిగారు వ్రాసిన “కంగళీల్ ఎన్న ఈరమో” అన్న పాట  సినిమాకి సోల్ లాంటిది.

కరుణ, జాలి ఉట్టిపడే ఈ పాటని ఏ. ఆర్. రహమాన్ శంకరాభరణం రాగంలో కంపోజ్ చేస్తే, బాలుగారు, చిత్రాగారు హృదయాలను కరిగించే లాగా పాడితే, ఇప్పుడు ఈ పాట “కంగళీల్ ఎన్న ఈరమో నెంజినిల్ ఎన్న భారమో

కైగలిళ్ అధై వాంగవా ఓరు తాయై పోల ఉనై తాంగవా” అని తమిళ్ లో గాయని మేధా అనంతుని ఎంతో మధురంగా, హృదయాన్ని కరిగించే విధంగా పాడి అమితంగా ఆకట్టుకుంది.

వేదాలు చదువుకోవచ్చు, వేదాంతము తెలుసుకోవచ్చు, నాదోపాసనలోని రహస్యాలను సొంతం చేసుకోవచ్చు. కానీ ధర్మానికి కట్టుబడాలి. అదిలేనప్పుడు విజ్ఞత నశిస్తుంది, వివేకము మన చేతికి చిక్కని పండే అవుతుంది. కొద్ది మంది విజ్ఞులకు మాత్రమే అరుదుగా దొరికే వివేకాన్ని, మంచి బుద్ధిని తనకూ ప్రసాదించమని త్యాగరాయస్వామివారు రాములవారిని శంకరాభరణ రాగంలో వేడుకుంటున్నారు.

“ఎందుకు  పెద్దల వాలే బుద్ధి నీయ్యవు ఎందు బోదునయ్య రామయ్య… అందరివలె దాటిదాటి వదరితి అందరాని  పండాయే గదరా” అనే కీర్తనను గాయని మానస గాడేపల్లి ఎంతో భక్తి పారవశ్యంతో శ్రీ రాములవారి దయని,  శ్రీ త్యాగరాజ స్వామివారి ఆశీర్వాదాన్ని, వీక్షకుల అభిమానాన్ని పొందేలా పాడి ఆకట్టుకుంది.  

శోభన్ బాబు హీరోగా నటించిన పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రంలో మెలోడీ మాస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ సత్యం గారు ‘ఇదే పాట ప్రతీ చోట ఇలాగే పాడుకుంటాను’ అన్న పాటని శంకరాభరణం రాగంలో ఎంతో అందంగా కంపోజ్ చేశారని ఈ పాత పల్లవిని వినిపించి ఆకట్టుకున్నారు పార్థు

సౌత్ కొరియన్ మూవీ ‘గ్రానీ’ అనే సినిమా ఆధారంగా తెలుగులో రీమేక్ చేయబడిన సినిమా “ఓ బేబీ”  2019 లో రిలీజ్ అయిన ఈ సినిమాలో ఒక వృద్ధురాలికి యవ్వనం తిరిగి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయనే అంశాన్ని తీసుకుని డైరెక్టర్ బి. నందిని రెడ్డి గారు ఎంతో అందంగా పిక్చరైజ్  చేశారు. ఈ సినిమాలో నటి సమంత పర్ఫామెన్స్ కి చాలా మంచి పేరు వచ్చింది. ఇందులో జాలిగా సాగే ఒక లాలిపాట మన గుండెల్ని తాకుతుంది.

లక్ష్మీభూపాల గారు రచించినటువంటి “ఆకాశంలోన ఏకాకి మేఘం శోకానిదా వాన… నడి వీధిలోన చనుబాల కోసం ఎదచూడకు నాన్న… తన పేగే తన తోడై తన కొంగే నీడై అరచేతి తలరాత ఎవరు చెరిపారో” అనే ఈ పాటని మిక్కీ జె. మేయర్ గారు శంకరాభరణ రాగంలో స్వర పరిస్థితే నూతన గాయని నూతన మోహన చాలా అందంగా పాడింది. ఈ పాటను  వీక్షకుల హృదయాలను తాకే విధంగా ఎంతో మధురంగా, చక్కగా పాడి ఎంతో అమితంగా ఆకట్టుకుంది గాయని శ్రీ సంహిత పొన్నపల్లి.  

కళ్ళు మూసుకుని ఇష్టదైవాన్ని స్మరించడం ధ్యానంలో ఒక భాగం. కళ్లు మూసినా తెరిచినా తన ఆరాధ్య దైవమైన శ్రీ రామచంద్రుల వారి నామరూపాలనే స్మరించడం, అంటిపెట్టుకుని ఉండడం వాగ్గేయకారుడైన తూము నరసింహ దాసు గారి జీవన విధానం. అది వారి రచనల్లో కూడా కనిపిస్తుంది. అక్కడ వారి హృదయం రత్నసింహాసనం అవుతుంది. దాని మీద ఆసీనుడైన సీతా సమేతుడైన శ్రీ రామచంద్ర మూర్తి వారికి దర్శనమిస్తారు. హనుమంతులవారి సేవలందుకునే పాదపద్మాలను చూసివొద్దాం రమ్మంటు తూము నరసింహ దాసు గారు ఈ కీర్తనలో మనందరిని ఆహ్వానిస్తే, ఈ కీర్తనను శంకరాభరణ రాగ ఛాయల్లో కంపోజ్ చేసే అదృష్టం నాది. రాగ ఛాయల్లో అని ఎందుకన్నానంటే పాట మొత్తం శంకరాభరణంలో ఉన్నా కూడా,  ఆర్కెస్ట్రేషన్లో అక్కడక్కడా అందం కోసం నేను కూడా అన్యస్వర ప్రయోగాలు చేయడం జరిగింది.

ఈ కీర్తనను స్వరపరచె భాగ్యం నాది.”చూచి సేవింతము రారే శ్రీరాములను…జూచి సేవింతము రారే రాచవాడైన కమలలోచను పదపద్మములు” అని కీర్తనలను ఎంతో చక్కగా, భక్తి పారవశ్యంలో పరవశించేటట్టు చేసి, ఆ శ్రీరాముల వారి ఆశీర్వాదం కలిగే విధంగా ఆలపించి ఆకట్టుకుంది గాయని నవ్య వేమూరి.

 

 

 

ఇప్పుడు నాకు బాగా ఇష్టమైన ఏఆర్ రెహమాన్ గారు శంకరాభరణం కంపోసిషన్ ఒకటి  వినిపించబోతున్నాను.  సినిమా ఇందిరా…  రైటర్ వైరముత్తు గారు పాడింది బాలుగారు, చిత్రాగారు.  అయితే ఈ పాట పల్లవి మాత్రమే వినిపించట్లేదు ఎందుకంటే ఈ పాట అంటే ఎంత ఇష్టం అంటే పూర్తి పాట నేను పాడుతున్నాను మీరు విని తీరాల్సిందే అని “తొడ తొడ మలందదెన్నపూవే తోట్టవనై మరందదెన్నతొడ తొడ మలందదెన్నపూవే తోట్టవనై” అనే తమిళ్ పాటను ఎంతో హాయిగా, చక్కగా, మధురంగా పాడి వీక్షకుల హృదయాలను రంజిపచేసారు గాయకుడు పార్థసారధి నేమాని (పార్థు).   

1964 లో రిలీజ్ అయిన ఒక సూపర్ హిట్ థ్రిల్లర్ హిందీ మూవీ ఓ కౌన్ థీ… మనోజ్ కుమార్, సాధన  హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ మదన్మోహన్ గారు కంపోజ్ చేసినటువంటి అన్ని పాటలు సూపర్ హిట్ పాటలే. రాజా మెహ్ది అలీ ఖాన్ రచించినటువంటి “లగ్ జా గలే” అన్న ఈ పాట తెలియని సంగీతాభిమాని ఉంటాడు అంటే నేను అస్సలు నమ్మను. లతా మంగేష్కర్ గారి గొంతులో నుంచి అమృతంలా జాలువారిన ఈ పాటని మదన్ మోహన్ గారు పల్లవంత శంకరాభరణంలో కంపోజ్ చేసినా చరణంలో అందం కోసం అన్యస్వర ప్రయోగాలు కూడా చేశారన్నమాట.

“లగ్ జా గలే కి ఫిర్ యే హసిన్ రాత్  హో నా హో షాయాద్ ఫిర్ ఇస్ జనం మే ములాకాత్ హో నా హో… లగ్ జా గలే” అనే ఈ పాటని గాయని  కావ్య బొర్రా ఎంతో చక్కగా, అందంగా పాడి  ప్రేక్షకుల హృదయాలను రంజింపచేసింది.

వెస్ట్రన్ మ్యూజిక్ బాగా తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఎక్కువ శాతం వాళ్ళు కంపోజిషన్స్ శంకరాభరణం లోను,  శంకరాభరణం రాగచ్ఛయాలలో చేస్తూ ఉంటారు. ఎందుకు చెప్పానంటే ఈ సంచికలో పిల్లలు పాటలు కానీ నేను మీకు వినిపిస్తున్న పల్లవులు కానీ ఎక్కువ మిక్కీ జే మేయర్ గారి కంపోసిషన్లే.ఆయన పాశ్చాత్య సంగీతం బాగా తెలిసిన అటువంటి మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు నేను వినిపించబోయే పాల్లవికూడా హ్యాపీ డేస్ సినిమాలో “అరెరే అరెరే” అన్న ఈ పాట వనమాలి గారు రాశారు, కార్తీక్ పాడారు మిక్కీ జే మేయర్ గారు శంకరాభరణం రాగంలో కంపోజ్ చేసారు. “అరే రే అరే రే, మనసే జారే అరే రే అరే రే, వరసే మారే” అనే పల్లవిని ఎంతో మధురంగా, చక్కగా పాడి అలరించారు పార్థు. 

డాలర్ డ్రీమ్స్ ఎక్స్పీరిఎన్స్ తో మొదలు పెట్టి ఒక మంచి కాఫీ లాంటి సినిమాతో మనందరికీ మైన్ స్ట్రీం లోని ఆనందాన్ని రుచిని చూపించిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల. జీవితంలోని చిన్న చిన్న సంతోషాలని సరదాల్ని ఒడిసి పట్టు కుంటే మన జీవితం ఎంత అందంగా ఉంటుందో శేఖర్ కమ్ముల గారు 2012లో తీసిన “లైఫ్ ఈస్ బ్యూటిఫుల్”  సినిమా ద్వారా మనందరికీ చెప్పారు. ఈ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించింది. ఇందులో టీనేజ్లో మన మనసు పడే అటూఇటూ ఊగే తికమకల్ని అనంత్ శ్రీరామ్ గారు పాటగా రాస్తే,  శంకరాభరణం రాగాన్ని బేస్ గా చేసుకొని మిక్కీ జే మేయర్ గారు స్వరపరిచారు.

శ్రీ రామ చంద్ర పాడిన “అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ తికమక పెంచుతోంది మనసు కేమయింది చకచక దూకుతూ తడబడి తుళ్లుతూ తలపుని తరుముతోంది వయసు కేమయింది” ఈ పాటని గాయని వీక్షితా పల్లెర్ల ఎంతో హుషారుగా పాడి వీక్షకులకు వీనులవిందు చేసి అమితంగా ఆకట్టుకుంది.

ఇప్పుడు నాకు నచ్చినటువంటి ఇంకొక రాగ్ బిలావల్ కంపోసిషన్ మీకు వినిపించబోతున్నాను. అమితాబచ్చన్, అంజాద్ ఖాన్, నీతూసింగ్, తనూజ నటించిన “యారానా” సినిమా. ఆనంద్ బక్షి గారి రచన, రాజేష్ రోషన్ గారి కంపోసిషన్, కిషోర్ కుమార్ గారి గానం “చూకర్ మేరె మన్ కో కీయ తూనే క్యా ఇషారా బద్లా ఎహ్ మౌసమ్ లగే ప్యారా జగ్ సారా” అనే పాటను ఎంతో అద్భుతంగా, ఎంతో హాయిగా, మధురంగా, చక్కగా పాడి వీక్షకుల హృదయాల్ని ఆనందిపచేసి, ఎంతో అంతీతంగా అక్కటుకున్నారు వ్యాఖ్యాత, గాయకుడు పార్థసారధి నేమాని (పార్థు).    

సో అదండి శంకరాభరణం రాగం, రాగ్ బిలావల్ కి సంబంధించిన కీర్తనలు, ఆధ్యాత్మిక గీతాలు, లలిత సంగీతం పాటలు, సినిమా పాటలు. వీటన్నిటిని మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను, స్వర రాగ గీతం కార్యక్రమంలో వచ్చేవారం మరిన్ని విశేషాలతో మిమ్మల్నదరిని కలుస్తాను, అంతవరకు సెలవు అని కీ సంచికను ఎంతో మధురంగా, చక్కగా ముగించారు ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, వ్యాఖ్యాత, కార్యక్రమం నిర్వాహకుడు, పార్థసారథి నేమాని (పార్థు)  

“స్వరవేదిక”, కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఆన్లైన్లో (యూట్యూబ్ ద్వారా) ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్న “స్వర రాగ గీతం” కార్యక్రమంలోని ప్రతీ ఎపిసోడ్ కి సంబంధించిన అంశాలను, విశేషాలను అక్షరరూపంలో మీ ముందు ఉంచడానికి ఓ చిరుప్రయత్నం చేస్తున్నది మీ…. కళావైభవం.కామ్ / www.kalavaibhavam.com  – కే.ఎల్. నరసింహా రావు (K.L. Narasimha Rao)                                                                                                                            Volunteer Technical Support: Shaliny Jadhav, Minnesota, USA

 

 

image_print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×