నమ్మకాన్ని కోల్పోకండి: సంచాలకులు మామిడి హరికృష్ణ

నమ్మకాన్ని కోల్పోకండి: సంచాలకులు మామిడి హరికృష్ణ

సినిమారంగంలో అడుగుపెట్టాలనుకుంటున్న యంగ్ ఫిలింమేకర్స్, తమ నమ్మకాన్ని కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ  అన్నారు.

సంజీవ్ పటేల్ స్మారకంగా దక్కన్ థియేటర్ స్కాలర్స్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్లైన్ క్రియేటివ్ డ్రమటిక్స్ కార్యక్రమం ద్వారా వచ్చిన 90,000/- రూపాయలను సంచాలకులు మామిడి హరికృష్ణ, సినీ దర్శకులు ధశరథ్ రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ లో శనివారంరోజు జరిగిన కార్యక్రమంలో సంజీవ్ పటేల్ కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ… తన స్వప్నాలను సాకరం చేసుకోవడానికి పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ వచ్చిన సంజీవ్ పటేల్ ఇక్కడి టీం సభ్యుడిగా చేరి అనేక నాటకాలకు, షార్ట్ ఫిలింలకు పోస్టర్ డిజైనింగ్, ఎడిటింగ్, డిఐ, గ్రాఫిక్స్ వంటి విభాగాల్లో పనిచేసి తన ప్రతిభను నిరూపించుకున్నాడన్నారు. ప్రజల్లో డ్రామాకు తగ్గుతున్న ఆదరణను చూసి డ్రామాను, సినిమాను కలుపుతూ ‘డ్రానిమా’ పేరుతో ఇక కొత్త ప్రయోగానికి శ్రీకారం చూట్టాడని, అందుకోసం ఎంతో పరిశోధన కూడా చేశాడని తెలిపారు. గత సంవత్సరకాలంగా కరోనా మహమ్మారి మనందరి ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని దూరం చేసిందిని, ఎలాంటి సమస్య వచ్చినా వాటిని కోల్పోవద్దని సంజీవ్ పటేల్ మనకిస్తున్న సందేశమని అన్నారు. సంజీవ్ ఎంతో ఇష్టంతో సినిమారంగానికి వచ్చాడని, మనం సినిమాలు తీయడమే తనకిచ్చే నివాళి అని పేర్కొంటూ… దక్కన్ థియేటర్ స్కాలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆన్లైన్ క్రియేటివ్ డ్రమటిక్స్ పేరుతో మూడు రోజులు క్లాసులు నిర్వహించిన డా. ఖాజాపాషా, డా. సురభి రమేష్, ఈ కార్యక్రమానికి సహకరించి క్లాసులు తీసుకొన్న దీపేందర్ రావత్ (న్యూఢిల్లీ), డి.ఎస్. కన్నన్ (దర్శకులు), సిహెచ్. నటరాజ్ (నాటకరంగ నిఫుణులు), ఎన్. దీనబాంధవ (చిల్డ్రన్ థియేటర్ ఎక్స్పర్ట్) లకు, మూడు రోజులు శిక్షణలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసిన నాటకసినీరంగ పెద్దలు, తెలంగాణ యూనివర్సిటీల రంగస్థల శాఖల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు, లెట్స్ ఫిల్మ్ తెలంగాణ మిత్రులు, నాటక సినీ ఔత్సాహికులకు ధన్యవాదాలు తెలిపారు.

ధశరథ్ మాట్లాడుతూ… ఇంతమంది స్నేహితులను, సన్నిహితులను సంపాదించుకున్న సంజీవ్ పటేల్ జీవితం ధన్యమని, మనతో మన పనిలో సంజీవ్ ఎల్లప్పుడూ జీవించే ఉంటాడని అన్నారు.

ఈ కార్యక్రమంలో డా. ఖాజాపాషా, డా. సురభి రమేష్, సంజీవ్ పటేల్ కుటుంబ సభ్యులు, మిత్రులు, నాటకసినీరంగ కళాకారులు పాల్గొన్నారు.

“మిస్ యూజ్” మరియు “సాధు” లఘుచిత్రాల ప్రదర్శన, టీంలతో ముఖాముఖి కార్యక్రమం
తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ప్రతివారం నిర్వహిస్తున్న సినివారంలో 2021, జూలై 10న రవికుమార్ దర్శకత్వం వహించిన “మిస్ యూజ్” మరియు సాయికుమార్ దర్శకత్వం వహించిన “సాధు” లఘుచిత్రాల ప్రదర్శన, టీంలతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ , సినీ దర్శకులు ధశరథ్ విచ్చేసి చిత్ర బృందాలను అభినందించి, పోచంపల్లి ఇక్కత్ హండ్లూమ్ ఓవెన్ శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా, అనంతరం జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో చిత్రబృందాలు పాల్గొని చిత్ర విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రేమికులు, యంగ్ ఫిలిం మేకర్స్ పాల్గొన్నారు.
(Courtesy: Cinivaram సినివారం – www.facebook.com/cinivaram.rb)

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *