ప్రముఖ కవి, రచయిత, పాత్రికేయులు దేవిప్రియ ఇకలేరు

ప్రముఖ కవి, రచయిత, పాత్రికేయులు దేవిప్రియ ఇవ్వాళ తెల్లవారుఝామున ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘాలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసాయి. దేవిప్రియ ఇకలేరు అని తెలిసి పలువురు సీనియర్ జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేసారు.

కవి, జర్నలిస్ట్ దేవిప్రియ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రగాఢ సానుభూతిని తెలిపారు

కవి, జర్నలిస్ట్ దేవిప్రియ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కవి, అమ్మచెట్టు, గాలిరంగు లాంటి అత్యుత్తమ సంకలనాలతో కేంద్ర సాహిత్య అవార్డు పొందిన దేవిప్రియ మరణం తెలుగు కవిత్వానికి తీరని లోటని ఆయన అన్నారు. అచ్చ తెలుగు కవిత్వం, అలతి అలతి పదాలతో అల్లు కున్న కవిత్వం దేవిప్రియదని… కనుమరుగు కావడం కవిత్వం కోల్పోయిన ఒక శకమని ఆయన అన్నారు. ఆయన మృతికి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు

7,844 thoughts on “ప్రముఖ కవి, రచయిత, పాత్రికేయులు దేవిప్రియ ఇకలేరు”