శ్రీత్యాగరాయ గాన సభ: ‘అక్షరం అమృతం’ సంపుటి లోని వ్యాసాలు అన్నీ సాహితీ రస ధార

‘అక్షరం అమృతం’ సంపుటి లోని వ్యాసాలు అన్నీ సాహితీ రస ధార

‘ అక్షరం అమృతం’ సంపుటి లోని వ్యాసాలు అన్నీ సాహితీ రస ధార లని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కే.వి. రమణ అన్నారు. శ్రీత్యాగరాయ గాన సభలోని కళా సుబ్బారావు కళా వేదిక పై శనివారం జీ.వీ.ఆర్. ఆరాధన కల్చరల్ ఫౌండషన్ నిర్వహణలో సాహితీ కిరణం సంపాదకుడు పొత్తూరి సుబ్బారావు రచించిన ‘అక్షరం అమృతం’ వ్యాస సంపుటి ఆవిష్కరణ సభ జరిగింది. ముఖ్య అతిధిగా డాక్టర్ రమణ పాల్గొని మాట్లాడుతూ సబ్భారావు కవిగానే కాక వ్యాస కర్త గా విశ్లేషణాత్మక వ్యాసాలు పలు అంశాలపై సృజించారని అభినందించారు. సంపుటిలో ఎనిమిది అంశాలపై మొత్తం 58 వ్యాసాలు ఉన్నాయని, అన్నీ రెండు పుటలు దాటకుండా క్లుప్త సుందరం గా ఉన్నాయని వివరించారు. నేటి నిజం పత్రిక సంపాదకులు బైస దేవ దాస్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ వివిధ పత్రికల్లో సుబ్బారావు గతం లో రాసిన వ్యాసాలను గుది గుచ్చి అక్షరామృతాన్ని అందించారని అభివర్ణించారు. జ్ఞానానికి అక్షరం సాధన మని అది అమృత తుల్యమని వివరించారు. సాహితీవేత్తలు రమణ వెలమకాన్ని, తంగిరాల చక్రవర్తి లు సుబ్బారావు వచన శైలిని విశిష్ట తను ప్రశంసించారు. వేదిక పై సుబ్బారావు తన సంపుటిని సుబ్బాయమ్మ కు అంకిత మిచ్చారు. వెంకట రెడ్డి స్వాగతం పలికిన కార్యక్రమానికి తొలుత పెద్దూరి వెంకట దాస్ నిర్వాహణ లో కవి సమ్మేళనం జరిగింది

Leave a Comment

Your email address will not be published.