శ్రీ మహావిష్ణు అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన లక్ష్మీనరసింహస్వామి

శ్రీ మహావిష్ణు అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన లక్ష్మీనరసింహస్వామి

యాదాద్రి భువనగిరి మార్చ్ 23: యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు మంగళవారం శ్రీ మహావిష్ణు అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిత్యారాధనల అనంతరం స్వామివారిని గరుడ వాహనంపై బాలాలయంలో ఉరేగించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ప్రధానార్చకులు నల్లందిగల్ లక్ష్మీ నరసింహచార్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా.. స్వామివారిని సమాచార శాఖ ముఖ్యకమిషనర్‌ బుద్ధ మురళీ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేసి, శేషవస్త్రంతో సత్కరించారు.

Print Friendly, PDF & Email
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *