బాల కళాకారులే మన సాంస్కృతిక రాయబారులు 28.09.18

బాల కళాకారులే మన సాంస్కృతిక రాయబారులు

మన బాల కళాకారులే మన సాంస్కృతిక రాయబారులని, మన సంస్కృతీ సాంప్రదాయలను ముందు తరాలకు తీసుకు వెళుతున్న వారధులని అతిథులు అన్నారు.

శ్రీ సచ్చిదానంద కళాపీఠం, త్యాగరయగానసభలు సంయుక్తంగా ఈ రోజు తేదీ 28.09.18 న  జరిగిన కళాసుబ్బారావు కళావేదికలో చిన్నారి కళాకారిణి జాహ్నవి కృష్ణన్ కు ట్రెడిషనల్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డు ను ప్రదానం చేసి గాయనిగా, నర్తకిగా, పద్య గాన చతురిణిగా బహు ముఖ ప్రజ్ఞలకు ప్రతీకగా నిలచిన ఆమే పటిమను అభినందించారు.

హాస్యబ్రహ్మ డా. శంకరనారాయణ, తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ సభ్యులు డా. వకుళాభరణం కృష్ణమోహన్, డా. పులివర్తి కృష్ణమూర్తి, కళాజనార్ధనమూర్తి, రజనీ వాచస్పతి, నేటినిజం బైసదేవదాసు, మల్లెల సుధాకర్, కళావైభవం.కామ్ కె.ఎల్. నరసింహా రావు, కళాపీఠం రత్నాకర శర్మలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో జాహ్నవి ఆటా పాట,బాల సచ్చిదానందం చిన్నారుల సంగీత నృత్యాలు అలరించాయి.

జాహ్నవికి అవార్డును బహుకరిస్తున్న అతిథులు

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *