శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: సామూహిక భోగిపండ్లు

సామూహిక భోగిపండ్లు

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: దేవస్థానం భోగిపండుగను పురస్కరించుకుని ఈ రోజు (13.01.2020) సామూహిక భోగిపండ్ల కార్యక్రమాన్ని నిర్వహించింది. ధర్మప్రచారములో భాగంగా ఈ కార్యక్రమము చేపట్టబడింది.

ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఈ కార్యక్రమం జరిపించబడింది. అయిదు సంవత్సరాల వయస్సు వరకు గల చిన్న పిల్లలకు ఈ భోగిపండ్లు వేయబడ్డాయి. దాదాపు 140 మందికిపైగా చిన్నారులకు ఈ బోగిపండ్లను వేయడం జరిగింది.

ఈ కార్యక్రమములో ముందుగా అర్చకస్వాములు, వేదపండితులు సంకల్పాన్ని పఠించారు. తరువాత సంప్రదాయాన్ని అనుసరించి గణపతిపూజ జరిపించబడింది.

అనంతరం శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచారపూజలు నిర్వహించబడ్డాయి.
పూజాదికాల తరువాత రేగుపండ్లను, చిన్న చిన్న చెరుకుముక్కలు కలిపి పిల్లల తలచుట్టూ మూడుసార్లు తిప్పి ఈ భోగిపండ్లను పిల్లలపై వేయడం జరిగింది.

తరువాత అర్చకస్వాములు, వేదపండితులు చిన్నారులను ఆశీర్వదించారు. ఈ భోగిపండ్లను వేయడం వలన పిల్లలకు పీడలు తొలగి, దృష్టి దోషాలు నశించి, ఆయురారోగ్యాలు చేకూరుతాయని చెప్పబడుతోంది.
ఇంకా ఈ భోగిపండ్ల గురించి ఎన్నో విశేషాలు కూడా ఉన్నాయి. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది.
పిల్లలపై భోగిపండ్లను వేయడం వలన బ్రహ్మరంధ్రం ప్రేరేపించబడుతుందని, దాంతో మెదడు ఉత్తేజాన్ని పొంది పిల్లలలో జ్ఞానశక్తి పెరుగుతుందని కూడా చెబుతారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సనాతన సంప్రదాయపరిరక్షణలో భాగంగా దేవస్థానం ఈ సామూహికంగా భోగిపండ్లు పోసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు.

జ్యోతిర్లింగస్వరూపుడైన శ్రీమల్లికార్జునస్వామివారు, మహా శక్తిస్వరూపిణి భ్రమరాంబాదేవివారు స్వయంవ్యక్తంగా వెలసిన శ్రీశైల ఆలయ ప్రాంగణంలో భోగిపండ్లతో ఆశీస్సులు పొందిన చిన్నారులందరు మంచి భవిష్యత్తును పొందగలుగుతారన్నారు.

250 thoughts on “శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: సామూహిక భోగిపండ్లు”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *