Kalavaibhavam.com(1-Mar): శ్రీశైల దేవస్థానంలో నిత్యకళారాధన నిర్వహిస్తున్న “నిత్యకళారాధన” (నివేదన)లో కూచిపూడి నృత్య ప్రదర్శన నృత్య ప్రదర్శనలు అలరించాయి

శ్రీశైల దేవస్థానంలో నిత్యకళారాధన నిర్వహిస్తున్న “నిత్యకళారాధన” (నివేదన)లో కూచిపూడి నృత్య ప్రదర్శన నృత్య ప్రదర్శనలు అలరించాయి

శ్రీశైల దేవస్థానంలో నిర్వహిస్తున్న “నిత్యకళారాధన” (నివేదన) కార్యక్రమంలో భాగంగా ఈరోజు (01.03.2020) పువ్వాడ లక్ష్మీ ప్రతిమ సునీల్, స్నేహ సంగీత నాట్య అకాడమీ, మార్కాపురం వారి కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. .

ఆలయ దక్షిణ మాడవీధి, హరిహరరాయ గోపురం వద్ద ఈ రోజు సాయంకాలం గం.6:30 ని||ల నుండి ఈ కూచిపూడి ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కూచిపూడి నృత్య ప్రదర్శనలో గణేశ కౌత్వం, సుబ్రహ్మణ్యకౌత్వం, అయిగిరినందిని, పంచమూర్తి కౌత్వం , చక్కని తల్లికి తదితర గీతాలకు టి. భాషిత, ఎ. మధురిమ, అనుష్క, వేదసంహిత, లాస్యప్రియ,
జాహ్నవి, మధుమిత, భవిష్య, మోక్ష, మేఘన, అక్షయ్య, మనోజ్ఞ, వాసుకి, రిషిత, భవ్యశ్రీ, భవిజ్ఞ, హారిక తదితరులు నృత్య ప్రదర్శన చేయనున్నారు.

కాగా ఈ నిత్యకళారాధనలో ప్రతి రోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయబడుతున్నాయి.

శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన (నివేదన) కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
ఈ కార్యక్రమాలలో ముఖ్యంగా స్థానిక కళాకారులకు అనగా జిల్లాలోని కళాకారులకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతోంది.

1 thought on “Kalavaibhavam.com(1-Mar): శ్రీశైల దేవస్థానంలో నిత్యకళారాధన నిర్వహిస్తున్న “నిత్యకళారాధన” (నివేదన)లో కూచిపూడి నృత్య ప్రదర్శన నృత్య ప్రదర్శనలు అలరించాయి”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *