Kalavaibhavam.com(8-Apr): శ్రీశైల దేవస్థానంలో వీరభద్రస్వామికి విశేష పూజలు

శ్రీశైల దేవస్థానంలో వీరభద్రస్వామికి విశేష పూజలు

Jwala Veerabhadra Swamy vishesha Pooja at Srisailam Temple

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: లోక కల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (08.04.2020) సాయంకాలం ఆలయప్రాంగణంలోని వీరభద్రస్వామివారికి (జ్వాలావీరభద్రస్వామి వారికి) విశేషపూజలను నిర్వహించడం జరుగింది.

ఆలయ ప్రాంగణంలో మల్లికార్జునస్వామివారి ఆలయానికి ఉత్తరభాగంలో మల్లికా గుండానికి ప్రక్కనే ఉన్న వీరభద్రస్వామి జ్వాలామకుటంతో పదిచేతులతో విశిష్ట రూపంలో దర్శనమిస్తాడు. శిల్పశాస్త్ర పరిభాషలో ఈ స్వామికి అఘోరవీరభద్రమూర్తి అని పేరు కూడా ఉంది. స్వామివారికి ప్రక్కనే దక్షప్రజాపతి కనిపిస్తాడు. ఈ స్వామిని పరివార ఆలయాలలో భాగంగా ప్రతినిత్యం పూజించడం జరుగుతోంది.

కాగా ప్రతి బుధవారం ప్రదోషకాలంలో విశేష అభిషేకం కార్యక్రమం దేవస్థానం నిర్వహిస్తోంది.
ఈ పూజవలన లోకశాంతి, దుర్భిక్షనివారణ, భక్తుల అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా క్షేత్ర అభివృద్ధి జరుగుతుంది.

కాగా ఈ పూజలలో ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజను జరిపించబడుతుంది. తరువాత వీరభద్రస్వామికి పంచామృతాలతోనూ, 5రకాల ఫలోదకాలతోనూ, గంధోదకం, భస్మోదకం, పుష్పోదకం, బిల్వోదకం, హరిద్రాదోకంతోనూ మరియు మల్లికా గుండంలోని శుద్ధజలంతో విశేష అభిషేకం జరిపిస్తారు.

ఈ అభిషేకాల తరువాత విశేషంగా స్వామివారికి పుష్పార్చనను చేస్తారు.

Print Friendly, PDF & Email
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *