Kalavaibhavam.com(11-Mar): శ్రీశైలం: నిత్య కళారాధన (నివేదన)లో సత్యసాయి భజన బృందం, సున్నిపెంట వారిచే భజన కార్యక్రమం

శ్రీశైలం: నిత్య కళారాధన (నివేదన)లో సత్యసాయి భజన బృందం, సున్నిపెంట వారిచే భజన కార్యక్రమం

శ్రీశైల దేవస్థానంలో నిర్వహించబడుతున్న “కళారాధన” (నివేదన) కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు (11.03.2020) సత్యసాయి భజన బృందం, సున్నిపెంట వారిచే భజన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.
ఆలయ దక్షిణ మాడవీధి, హరిహరరాయ గోపురం వద్ద ఈ రోజు సాయంకాలం గం. 6:30 ని||ల నుండి ఈ భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మహా గణపతిం భజే, అమ్మ అమ్మ సరస్వతి, శ్రీశైలం శివమయం, శంకర శివ శంకర, ఓం హర శంకర, నాలోన శివుడు గలడు, ఉన్నది ఒకడే శివుడురా, శ్రీశైలంలో వెలసిన ఓ తల్లి, పంచాక్షరి మంత్రం పఠనం చేయరా తదితర భక్తి గీతాలకు మల్లికార్జున, కనకదుర్గ, రామకృష్ణ, సుబ్బారావు, శ్రీనివాసు, గాయత్రి, నాగార్జున,మౌనిక తదితరులు భజనలు చేసారు.

కాగా ఈ నిత్యకళారాధనలో ప్రతి రోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయబడుతున్నాయి.

శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ కళారాధన (నివేదన) కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.

ఈ కార్య క్రమాలలో ముఖ్యంగా స్థానిక కళాకారులకు అనగా జిల్లాలోని కళాకారులకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతోంది.

రేపటి (12.03.2020) కళారాధనలో భాగంగా శ్రీ రామన్నగౌడ్, కర్నూలు వారిచే భజన కార్యక్రమం.

Print Friendly, PDF & Email
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *