30.07.2020: గాంధీనగర్ హరిహర కళాక్షేత్రం ఆలయంలో చిన్నారులకు గజ్జెపూజ

గాంధీనగర్ హరిహర కళాక్షేత్రం ఆలయంలో చిన్నారులకు గజ్జెపూజ

ప్రముఖ నృత్యగురువు వేదాంతం సత్య నరసింహ శాస్త్రి ఆధ్వర్యంలో ఆయన శిష్యులు చిన్నారులు లేఖన, అనఘ, సహస్రలకు గాంధీనగర్ హరిహర కళాక్షేత్రం ఆలయంలో గజ్జెపూజ నిర్వహించారు.

వినాయక శబ్దం, బ్రహ్మాంజలి నృత్యాలతో ఆ నర్తనబాలలు ఆ గుడిలో హరిహరులకు తమ నర్తన గజ్జెపూజతో నృత్యాంజలి సమర్పించారు. కరోనా కారణంగా కొన్ని ఆన్ లైన్ తరగతులే నిర్వహిస్తున్నామని వేదంతం ఆంధోళన వెలిబుచ్చారు. ఈ చిన్నారుల గజ్జెపూజ ఎప్పుడో నిర్ణయించినదని, శ్రద్ధగా నాట్యం నేర్చుకునే ఈ పాపలకు ఆలయ నిర్వాహకుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, సాంస్కృతిక వేడుకలు జరుపుకొనే వసంత కాలం ఎప్పుడొస్తుందోనని అందరూ ఎదిరిచూస్తున్నరని ఆయన అన్నారు. నిత్యం తాతై తకతై శబ్దాలాతో కళ కళ లాడే నాట్యాలయ సంస్థలు, కళావేదికలు బోసిబోయాయని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. ఆలయ ముఖ్యులు శ్రీమతి లలిత, ఆదరణ సేవాసంస్థ అధ్యక్షులు డా.కె. నాగేశ్వరరావు,తల్లి అన్నపూర్ణ, తండ్రి బాలరాజులు పాల్గొన్న ఈ చిన్నారుల వేడుకలో ఆలయ అర్చకులు ఆశీర్వచన వేద మంత్రాలతో, తీర్థ ప్రసాదాలతో చిన్నారులను దీవించారు.

 

208 thoughts on “30.07.2020: గాంధీనగర్ హరిహర కళాక్షేత్రం ఆలయంలో చిన్నారులకు గజ్జెపూజ”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *