18.03.21 యాదగిరిగుట్ట: శ్రీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు శ్రీకృష్ణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు… రాత్రి హంసవాహనంపై ఊరేగిన యాదాద్రీశుడు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు శ్రీకృష్ణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు… రాత్రి హంసవాహనంపై ఊరేగిన యాదాద్రీశుడు
4th day of Yadadri Brahmotsavams 2021 – Sri Krishna Alamkarana and Hamsa Vahana Seva performed traditionally
శ్లో|| సంసార దావ దహనాకుల భీకరోగ్ర – జ్వాలావళీభి రభిదగ్ద తనూరుహస్య |
త్వత్పాద యుగ్మ సరసీరుహ మస్తకస్య – లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్ ||
కళావైభవం.కామ్ యాదాద్రి ప్రతినిధి శంకర్ పోతుగంటి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములలో భాగంగా నాలుగో రోజైన ఈ రోజు తేది.18.03.2021 గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారని అధికారులు ప్రకటనలో తెలిపారు. . ఉదయం శ్రీ స్వామి వారి బాలాలయములో నిత్యఆరాధనల అనంతరం ఉదయం గం.11.00లకు శ్రీ స్వామి వారిని శ్రీ కృష్ణ (మురళీకృష్ణు)నిగా అలంకరించి ప్రధానార్చకులు, యుజాచార్యులు, ఆలయ ఉప ప్రధానార్చకులు, అర్చక బృందము, పారాయణీకులు అత్యంత వైభవముగా బాలాలయములో ఊరేగించినారని తెలిపారు. ఈ వేడుకలలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎన్. గీత, సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు.
సాయంకాల కార్యక్రమములు:
ఈ రోజు సాయంకాలము శ్రీ స్వామి వారి బాలాలయములో నిత్య ఆరాధనల అనంతరం రాత్రి శ్రీ స్వామి వారిని అలంకరించి హంసవాహన సేవలో బాలాలయములో ఊరేగించినారని తెలిపారు. ఈ వేడుకను ఆలయ ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, అర్చక బృందము, పారాయణీకులు నిర్వహించెదరు. ఈ వేడుకలో ఆలయ అధికారులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారని తెలిపారు.
ఉచిత వైద్యశిబిరము:
ఈ రోజు తేది.18.03.2021న డా. జె.కళ్యాణ్, యం.బి.బి.ఎస్. డియన్ బి (జనరల్ మెడిసిన్) జనరల్ ఫిజిషియన్ మరియు డైయాబెటాలజిస్ట్ హైద్రాబాద్ వారు మరియు డా. పి.పుల్లయ్య, యం.బి.బి.ఎస్. విశ్రాంత మెడికల్ ఆఫీసర్, ఎస్.ఎల్.ఎన్.ఎస్.డి. యాదాద్రి వారలచే అల్లోపతి జనరల్ ఉచిత వైద్యశిబిరము నిర్వహింపబడినదాని, సుమారు 200 మంది వరకు వీరి ఉచిత సేవలు పొందారని అధికారులు తెలిపారు.