మాదాపూర్ శిల్పారామంలో అట్టహాసంగా ముగిసిన ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా – ముఖ్య అథితిగా విచ్చేసిన ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ – ఆకట్టుకున్న భరతనాట్య ప్రదర్శన
మాదాపూర్ శిల్పారామంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా ముగింపు సంబరాలు శుక్రవారం అట్టహాసంగా ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్. లింగ శ్రీనివాస్ జానపద బృందం నగారా కొమ్ములతో సంప్రదాయంగా కిషన్ రావు స్పెషల్ ఆఫీసర్ శిల్పారామం స్వాగతం పలికారు. వివిధ రాష్ట్రాలనుండి విచ్చేసిన చేనేత హస్త కళాకారులను కలిశారు, కళా ఉత్పత్తులను అడిగి తెలుసుకున్నారు.
నేషనల్ అవార్దీ వచ్చిన చేనేత హస్త కళాకారులను సన్మానించారు. సంత్ కబీర్ అవార్దీ నారాయణ్ సామర్థ్, గుజరాత్ శాలువాలు, శిల్పగురు అవార్దీ జహీరుద్దీన్ ఉత్తర్ ప్రదేశ్ టెర్రకోట, నేషనల్ అవార్దీ దాని రామ్ సోని- బ్రాస్ మెటల్, నీలాంబరి ప్రసాద్ చత్తీస్గర్ద్ కొస సారీస్ వారిని సత్కరించారు. ఎక్కువ సేల్స్ అయినా చేనేత కళాకారులను షా రోమి హాసన్ కాశ్మీరీ శాలువాలు, జహీద్ హుస్సేన్ కోట చీరలు కూడా సన్మానించారు.
శిల్పారామం పచ్చని వాతావరణాన్ని, పరిశుభ్రతకు, రంగు రంగు పూలని అలంకరించడం, టెర్రకోట ఆర్చ్లు, అందాలకి మంత్రముగ్దలు అయ్యారు. చేనేత హస్త కళాకారులకి చేయూతను ప్రభుత్వమూ అందిస్తుంది అని చెప్పారు.
వైదేహి సుభాష్ శిష్య బృందం ప్రదర్శించిన భరతనాట్య ప్రదర్శన ఆధ్యంతం తిలకించారు.