మాదాపూర్ శిల్పారామంలో ఘనంగా ముగిసిన ఆజాది కా అమృత్ మహోత్సవ్

మాదాపూర్ శిల్పారామంలో ఘనంగా ముగిసిన ఆజాది కా అమృత్ మహోత్సవ్

శిల్పారామం మాదాపూర్ లో రీజినల్ పాస్ పోర్ట్ ఆఫీస్, హైదరాబాద్ సెక్రటేరియట్ బ్రాంచ్, ప్రొటెక్టర్ అఫ్ ఏమిగ్రంట్స్, ఐసీసీఆర్ మరియు శిల్పారామం  హైదరాబాద్ సంయుక్త నిర్వహణలో “ఆజాది కా అమృత్ మహోత్సవ్” ముగింపు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ముఖ్య అతిధిగా శిల్పవల్లి డీసీపీ మాదాపూర్ జోన్, సైబరాబాద్ కమీషనరేట్, దాసరి బాలయ్య IRS రీజినల్ పాస్పోర్ట్ ఆఫీసర్ మరియు హెడ్ అఫ్ మినిస్ట్రీ అఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ బ్రాంచ్ సెక్రటేరియట్, హైదరాబాద్ వారు విచ్చేసారు.

కుమారి ఐశ్వర్య, కుమారి కుందనికా కూచిపూడి ప్రదర్శన ఎంతగానో అలరించింది.విజేష్ వాళ్ళత్ వారి శిష్య బృందం మరియు అర్చన శిష్య బృందం కథక్ నృత్య ప్రదర్శనలో దేశభక్తి పాట పై ప్రదర్శించిన పలు అంశాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

తెలంగాణ  రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అశోక్ బృందం ఒగ్గు డోలు, సందీప్ బృందం పేరిణి ప్రదర్శనలు ఆకట్టుకున్నవి. పెయింటింగ్ పోటీలో గెలిచిన వారికీ ముఖ్య అతిథులచేత ప్రశంస పత్రాలు ప్రదానం చేసారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *