Tirupathi, Yadadri, Bhadrachalam & Srisailam Temples Updates

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 20.08.23: నాగులచవితి

నాగులచవితి శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: నాగులచవితిని కొన్ని ప్రాంతాలలో శ్రావణమాసంలో ఆచరిస్తుండగా, మరికొన్ని చోట్ల కార్తీకమాసంలో ఆచరిస్తున్న కారణంగా శ్రావణ శుద్ధ చవితి అయిన ఈ రోజున (20.08.2023) పలువురు భక్తులు ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట వద్ద నాగదేవతలను పూజించారు. ఈ రోజు వేకువజాము నుండి భక్తులు నాగులకట్ట వద్దకు చేరుకొని పత్తితో చేసిన వస్త్రం, యజ్ఞోపవీతం, పలురకాల పుష్పాలు మొదలైన వాటితో నాగమూర్తులను అలంకరించి పాలతో అభిషేకించారు. తరువాత నువ్వులపిండి, చలిమిడి, వడపప్పులను నివేదించారు. కాగా …

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 20.08.23: నాగులచవితి Read More »

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం (19.08.23): గో సంరక్షణ పథకానికి విరాళం

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం (19.08.23): గో సంరక్షణ పథకానికి విరాళం రూ. 1,01,000/-లను శ్రీ వి.మల్లికార్జునప్ప, రంగారెడ్డి జిల్లా వారు పర్యవేక్షకులు టి. హిమబిందుకు అందచేసారు.

శ్రీశైలదేవస్థానం, శ్రీశైలం 18.08.23: అంకాళమ్మ వారికి విశేష పూజలు; సాంస్కృతిక కార్యక్రమాలు

అంకాళమ్మ వారికి విశేష పూజలు శ్రీశైలదేవస్థానం, శ్రీశైలం: లోక కల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత అయిన శ్రీ అంకాళమ్మ వారికి ఈ రోజు (18.08.2023) ఉదయం అభిషేకం, విశేష పూజలను నిర్వహించడం జరిగింది. ప్రతి శుక్రవారం రోజున శ్రీఅంకాళమ్మ వారికి దేవస్థానం సేవగా (సర్కారిసేవగా ఈ విశేషపూజ జరిపించబడుతోంది. ఇందులో భాగంగా శ్రీ అంకాళమ్మ వారికి అభిషేకం, విశేష అర్చనలు, పుష్పాలంకరణ, కుంకుమార్చనలు జరిపించబడ్డాయి. కాగా శ్రీశైల క్షేత్రానికి గ్రామదేవతగా చెప్పబడుతున్న అంకాళమ్మ ఆలయం, …

శ్రీశైలదేవస్థానం, శ్రీశైలం 18.08.23: అంకాళమ్మ వారికి విశేష పూజలు; సాంస్కృతిక కార్యక్రమాలు Read More »

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 17.08.23: దత్తాత్రేయస్వామివారికి విశేష పూజలు; శ్రావణమాసం సందర్భంగా శివచతుస్సప్తాహ భజనలు; సాంస్కృతిక కార్యక్రమాలు

దత్తాత్రేయస్వామివారికి విశేష పూజలు శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: లోకకల్యాణంకోసం దేవస్థానం ఈ రోజు (17.08.2023) ఆలయప్రాంగణంలోని త్రిఫలవృక్షం క్రింద నెలకొని ఉన్న శ్రీ దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలను నిర్వహించింది. ప్రతి గురువారం దేవస్థానసేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం జరిపించబడుతోంది. ఈ పూజాకార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతిపూజను జరిపించబడింది. ఆ తరువాత దత్తాత్రేయస్వామివారికి పంచామృతాభిషేకం, విశేషపూజలు నిర్వహించబడ్డాయి. లోకోద్ధరణకోసమై బ్రహ్మ,విష్ణు, మహేశ్వరులు ఒకే స్వరూపములో దత్తాత్రేయునిగా అవతరించారు. అందుకే త్రిమూర్తి స్వరూపునిగా దత్తాత్రేయుడు ప్రసిద్ధుడు. శ్రీశైలక్షేత్రానికి దత్తాత్రేయుల వారికి …

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 17.08.23: దత్తాత్రేయస్వామివారికి విశేష పూజలు; శ్రావణమాసం సందర్భంగా శివచతుస్సప్తాహ భజనలు; సాంస్కృతిక కార్యక్రమాలు Read More »

శ్రీశైల దేవస్థానం (16.08.23): పసుపర్తి వెంకటరమణ, కూచిపూడి నృత్య అకాడమీ, అభినయ స్కూల్ సింహాచలం సమర్పించిన సంప్రదాయ నృత్య ప్రదర్శన

శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం)  బుధవారం   పసుపర్తి వెంకటరమణ, కూచిపూడి నృత్య అకాడమీ, అభినయ స్కూల్ సింహాచలం వారు  సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు. కార్యక్రమం లో వినాయక కౌత్వం, నటరాజ తిలానా, మల్లికార్జున కౌత్వం, శివాష్టకం, భ్రమరాంబిక అష్టకం తదితర గీతాలకు ధన్య, గాయత్రి, ఎ. యక్షిత, భవాని, పూజిత, కావ్య, ప్రసన్న, హర్షిణి, మాలతి, భాను, లాస్య, లలిత తదితరులు నృత్య ప్రదర్శన చేసారు. మృదంగ సహకారాన్ని  అనంతరావు, వయోలిన్ …

శ్రీశైల దేవస్థానం (16.08.23): పసుపర్తి వెంకటరమణ, కూచిపూడి నృత్య అకాడమీ, అభినయ స్కూల్ సింహాచలం సమర్పించిన సంప్రదాయ నృత్య ప్రదర్శన Read More »

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం (16.08.23): శ్రీ సాక్షిగణపతిస్వామికి విశేష అభిషేకం

శ్రీ సాక్షిగణపతిస్వామికి విశేష అభిషేకం శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం:  లోక కల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (16.08.2023) ఉదయం సాక్షిగణపతిస్వామి వారికి విశేష అభిషేకాన్ని నిర్వహించింది. కాగా ప్రతి బుధవారం, సంకటహరచవితిరోజులు మరియు పౌర్ణమిరోజులలో శ్రీసాక్షిగణపతి వారికి ఈ విశేష అభిషేకం మరియు పూజాదికాలు దేవస్థానంసేవగా (సర్కారిసేవగా) నిర్వహించబడుతున్నాయి. ఈ ఉదయం సాక్షిగణపతిస్వామివారికి పంచామృతాలతోనూ, పలుఫలోదకాలతోనూ, హరిద్రోదకం, గంధోదకం, పుష్పోదకం, కలశోదకం, శుద్ధజలంతో అభిషేకం నిర్వహించబడింది. తరువాత స్వామివారికి విశేషపుష్పార్చన, నివేదన కార్యక్రమాలు జరిపించబడ్డాయి. వైదిక సంప్రదాయాలలో …

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం (16.08.23): శ్రీ సాక్షిగణపతిస్వామికి విశేష అభిషేకం Read More »

శ్రీశైల దేవస్థానంలో 17వ తేదీ నుంచి శివచతుస్సప్తాహ భజనలు

శ్రీశైల దేవస్థానంలో 17వ తేదీ నుంచి శివచతుస్సప్తాహ భజనలు   శ్రీశైల దేవస్థానం: పవిత్ర శ్రావణ మాసంలో శివస్మరణ అత్యంత విశిష్టమైనది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని లోక కల్యాణం కోసం ప్రతీ సంవత్సరం శ్రావణ మాసంలో దేవస్థానం శివచతుస్సప్తాహ భజనలు నిర్వహిస్తోంది. అంటే నెల పూర్తిగా రేయింబవళ్లు నిరంతరంగా ఈ భజన సాగుతుంది. ఈ పవిత్ర అఖండ భజనలు శ్రావణమాస ప్రారంభం సందర్భంగా ఆలయప్రాంగణంలోని వీరశిరోమండపంలో 17.08.2023 నుంచి శివసప్తాహ భజనలు ప్రారంభమవుతాయి. ఈ భజన …

శ్రీశైల దేవస్థానంలో 17వ తేదీ నుంచి శివచతుస్సప్తాహ భజనలు Read More »

శ్రీశైల దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు స్వాగతం సుస్వాగతం

శ్రీశైల దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు స్వాగతం సుస్వాగతం   11.02.2023 ఉదయం 8.46 గంటలకు శ్రీ స్వామివారి ఆలయ యాగశాలలో  మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు  

భద్రాచలం(05.11.22): జగన్మోహిని అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్న శ్రీ సీతారామచంద్రస్వామి

శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా స్వామివారు జగన్మోహిని అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు.

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: పరోక్షసేవగా బయలు వీరభద్రస్వామివారి విశేషపూజ

పరోక్షసేవగా బయలు వీరభద్రస్వామివారి విశేషపూజ  శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: ఈ రోజు సోమవారము (24,10,2022) సాయంత్రానికి అమావాస్య ఘడియలు రావడంతో శ్రీశైలక్షేత్ర పాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామి వారికి విశేషార్చన జరిపించారు. ప్రతీ మంగళవారం అమావాస్యరోజులలో ఈ విశేషార్చనను జరిపించడం జరుగుతోంది. కాగా అమావాస్య రోజున భక్తులు కూడా పరోక్షసేవగా ఈ అర్చనను జరిపించుకునే అవకాశం కల్పించబడింది. ఈ రోజు పరోక్షసేవ ద్వారా పలువురు భక్తులు ఈ విశేషపూజలను జరిపించుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, …

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: పరోక్షసేవగా బయలు వీరభద్రస్వామివారి విశేషపూజ Read More »