శ్రీశైల దేవస్థానం శ్రీశైలం 20.10.2023: కాత్యాయని అలంకారంలో అమ్మవారు ; స్వామిఅమ్మవార్లకు హంసవాహనం సేవ
దసరా మహోత్సవాలలో భాగంగా ఆరవ రోజైన నేడు కాత్యాయని అలంకారంలో అమ్మవారు శ్రీశైల దేవస్థానం శ్రీశైలం 20.10.2023: దసరా మహోత్సవాలలో భాగంగా ఆరవ రోజైన ఈ రోజు (20.10.2023) ఉదయం అమ్మవారికి ప్రాత:కాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్ఠానాలు, పారాయణలు, సూర్య నమస్కారములు, చండీహోమం, పంచాక్షరి, భ్రామరి, బాలా జపానుష్ఠానములు, చండీపారాయణ, చతుర్వేద పారాయణలు, కుమారీపూజలు జరిపించబడ్డాయి. అదేవిధంగా రుద్రహోమం, రుద్రయాగాంగ జపములు, రుద్ర పారాయణలు జరిపించబడ్డాయి. అదేవిధంగా ఈ సాయంకాలం జపములు, పారాయణలు, …