22.10.2020: శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: దసరా మహోత్సవాలు – ఆరవ రోజు

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: దసరా మహోత్సవాలు – ఆరవ రోజు

Dasara Mahotsavalu on 6th Day – at Srisailam Temple 22.10.20

శ్రీశైల దేవస్థానంలో దసరా మహోత్సవాలలో భాగంగా ఆరవ రోజైన ఈ రోజు (22.10.2020) ఉదయం ప్రాత:కాలపూజలు, విశేషకుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్ఠానాలు, పారాయణలు, సూర్య నమస్కారములు, చండీహోమం, పంచాక్షరి, భ్రామరి, బాలా జపానుష్ఠానములు, చండీ పారాయణ, చతుర్వేద పారాయణలు, కుమారీపూజలు జరిపించబడ్డాయి. శ్రీస్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, రుద్రయాగాంగ జపములు, రుద్ర పారాయణలు జరిపించబడ్డాయి.
అదేవిధంగా ఈ సాయంకాలం జపములు, పారాయణలు, నవావరణార్చన, కుంకుమార్చన, చండీ హోమం జరిపించబడింది.

ఈ రోజు రాత్రి కాళరాత్రిపూజ, మంత్రపుష్పం, అమ్మవారి ఆస్థాన సేవ, సువాసినీ పూజలు జరిగాయి.

కుమారి పూజ


దసరామహోత్సవాలలో భాగంగా కుమారి పూజలు నిర్వహించడం జరుగింది.
ఈ కుమారి పూజలో రెండు సంవత్సరాల నుంచి పదిసంవత్సరాల వయస్సు ఉన్న బాలికలను పూలు, పండ్లు, నూతనవస్త్రాలను సమర్పించి పూజించడం జరుగుతుంది. కుమారి పూజ నవరాత్రి ఉత్సవాలలో ఒక ముఖ్యమైన సంప్రదాయం .

కాత్యాయని అలంకారం


ఈ నవరాత్రి మహోత్సవాలలో చేయబడుతున్న నవదుర్గ అలంకారాలలో భాగంగా శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తిని కాత్యాయని స్వరూపంలో అలంకరింపజేయడం జరుగింది.

నవదుర్గలలో ఆరవ రూపమైన ఈ దేవి చతుర్భుజాలను కలిగి ఉండి, కుడివైపున అభయ హస్తాన్ని, వరదముద్రను, ఎడమవైపున పద్మాన్ని, ఖడ్గాన్ని ధరించి ఉంటుంది. కాత్యాయని దేవిని ఆరాధించడం వల్ల రోగ, శోక, భయాలను తొలగించుకోవచ్చునని చెప్పబడింది. ఇంకా శ్రీ కృష్ణుని భర్తగా పొందేందుకు గోపికలు ఈ అమ్మవారినే పూజించారట.

కాత్యాయని ఆరాధన వల్ల జన్మజన్మల పాపాలన్నీ కూడా హరింపబడుతాయంటారు.

హంసవాహనసేవ


ఈ ఉత్సవాలలో శ్రీస్వామిఅమ్మవార్లకు నిర్వహిస్తున్న వాహనసేవలలో భాగంగా ఈ రోజు హంసవాహనసేవ జరిపించబడింది.

ఈ వాహనసేవలో శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరింపజేసి, హంస వాహనంపై వేంచేబు చేయించి పూజాదికాలు చేయబడ్డాయి.

Print Friendly, PDF & Email
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *