శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని ఈరోజు స్వామిఅమ్మవార్లకు గజవాహనసేవ

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం – బ్రహ్మోత్సవాలలో ఈరోజు  సోమవారం (28.02.2022):

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని ఈరోజు స్వామిఅమ్మవార్లకు గజవాహనసేవ

శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని ఈ రోజు సోమవారం స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి.

యాగశాలలో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేసారు.

అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా నిర్వహించారు.

సాయంకాలం ప్రదోష కాల పూజలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, హోమాలు జరిగాయి.

గజవాహన సేవ

ఈ రోజు రాత్రి శ్రీ స్వామిఅమ్మవార్లకు గజవాహనసేవ జరిగింది. ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవ మూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో గజవాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. తరువాత శ్రీశైలక్షేత్ర ప్రధాన వీధులలో గ్రామోత్సవం జరుగనున్నది. కోలాటం, చెక్కభజన, రాజబటులవేషాలు, జాంజ్ పథక్, జానపద పగటి వేషాలు, గొరవనృత్యం, బుట్టబొమ్మలు, తప్పెటచిందు బీరప్పడోలు, చెంచునృత్యం, నందికోలసేవ, డమరుకం, చితడలు, శంఖం, పిల్లన్నగ్రోవి తదితర కళారూపాలను గ్రామోత్సవంలో ఏర్పాటు చేసారు.

రథ శిఖర కలశానికి పూజాదికాలు:

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మార్చి 2వ తేదీన రథోత్సవం జరుగనున్నది. ఈ సందర్భంగా ఈ రోజు సోమవారం రథ శిఖర కలశానికి ఆలయములో పూజాదికాలు జరిపించారు. ఈ పూజల అనంతరం రథ శిఖర కలశాన్ని సంప్రదాయబద్ధంగా రథం వద్దకు చేర్చారు.

బ్రహ్మోత్సవాలలో స్వామివార్లకు వివిధ రకాల ఫలాల సమర్పణ

ఈ రోజు సోమవారం హైదరాబాద్ కు చెందిన శ్రీ బి.పర్వతయ్య, శారదా దంపతులు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివార్ల లింగోద్భవకాల అభిషేకానికి వివిధ రకాల పండ్లను మరియు డైపుట్స్ తదితర వాటిని సమర్పించారు.

కాగా 3 వేల తమలపాకులు, 500 అరటిపండ్లు, 400 బత్తాయిపండ్లు, 400 కమలాపండ్లు, 400 సపోటా పండ్లు, 35 కేజీల నల్లద్రాక్ష, 35 కేజీలు ద్రాక్ష, 100 చెరుకుగడ్డలు, 150 కొబ్బరిపాల డబ్బాలు, 100 ఫైనాఫిల్స్, 120 యాపిల్ పండ్లు, 10 డజన్లు దానిమ్మపండ్లు, 130 జామపండ్లు అందజేశారు. ఇంకా పలు రకాల డ్రైఫ్రూట్స్ కూడా వీరు అందజేయడం జరిగింది.

అదేవిధంగా బ్రహ్మోత్సవ కల్యాణ తలంబ్రాల ముత్యాలను కూడా వీరు అందజేయడం జరిగింది. ఇంకా పట్టువస్త్రాలను కూడా వీరు సమర్పించారు. గతంలో అల్యూమినియంతో తయారు చేసిన, గిన్నెలు, బకెట్లు, జాలిగరిటెలు మొదలైన పాత్రలను కూడా వస్తువులను లడ్డు ప్రసాదాలకు అవసరమైన వస్తువులను అందజేయడం జరిగింది. కాగా దేవస్థానములో వీరు కుటీరనిర్మాణ పథకంలో ఒక కాటేజీని కూడా నిర్మించారు. ప్రస్తుతం పూర్తి రాతినిర్మాణంగా అమ్మవారి యాగశాలను కూడా నిర్మిస్తున్నారు.

సాంస్కృతిక కార్యక్రమాలు

28.02.2022 Kathak 2d Programme at Pushkarini (Dr. K.Srivalli & Teem, Hyderabad)

Bhukailash 2nd Programee At Shiva Deeksha Shibhiralu (Sri Mallakrjuna Natyamandali)

Shivalilalu Programme At Shiva Deeksha Shibhiralu (V.Dattu Babu, Vijayawada)

Shivatatav Pravahcnam Programme At Pushkarani Stage (Dr.I.L.N. Chandrashekar)

Bhakthiranjani 2nd Programme At Pushkarani Stage (B.R.V.S.Pavan Kumar Charan, Vijayanagaram)

34 thoughts on “శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని ఈరోజు స్వామిఅమ్మవార్లకు గజవాహనసేవ”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *