మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు
మాదాపూర్ శిల్పారామంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళ లో సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కూచిపూడి మరియు భరతనాట్య ప్రదర్శనలు ఆధ్యంతం అలరించాయి.
అపర్ణ ధూళిపాళ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో గణపతి శ్లోకం, జతిస్వరం, ప్రవేశ దరువు-భామ, దశావతార శబ్దం, అన్నమాచార్య కీర్తన-కులుకాగా, అన్నమాచార్య కీర్తన- అలరులు, తిల్లాన అంశాలను అపర్ణ, ఆరుషి, యామిని, యాషికా ప్రదర్శించి మెప్పించారు.
రాధా రాణి శిష్య బృందం భరతనాట్య ప్రదర్శనలో భాగంగా పుష్పాంజలి, గణేశా వందనం, సాయి పఞ్చరత్నం, తంబుర మీటేదవ- పురందర దాస కీర్తన, భాగ్యదా లక్ష్మి, భజగోవిందం, వేంకటాచల నిలయం, మంగళం అంశాలను అర్షిత, తనుశ్రీ, శ్రీత శర్మ,వర్షిణి, వర్షిత, హారిక, వాసవి ప్రియా మొదలైన వారు ప్రదర్శించారు.