Kalavaibhavam.com(19-Mar): తేది. 20.03.2020 నుండి తేది. 31.03.2020 వరకు యాదాద్రిలో అర్జిత సేవలు రద్దు
తేది. 20.03.2020 (శుక్రవారము)నుండి తేది. 31.03.2020 వరకు యాదాద్రిలో అర్జిత సేవలు రద్దు
యాదాద్రి భువనగిరి మార్చ్19: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అర్జిత సేవలను తేది. 20.03.2020 (శుక్రవారము) నుండి ఈ నెల 31వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు దేవాలయ కార్యనిర్వహాణదికారి గీత తెలియచేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా ఈ చర్యల తీసుకున్నట్లు, ఆలయానికి వచ్చే భక్తులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
స్వామివారి లఘు దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
భక్తుల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టుటకు గాను శ్రీ స్వామి వారి నిత్య కైంకర్యములను యధావిధిగా నిర్వహిస్తూ…భక్తులు చేయించు అర్జిత సేవలు (నిత్య అభిషేకములు, సువర్ణపుష్పార్చనలు, అష్టోత్తరములు, అర్చనలు, సుదర్శన నారసింహ హోమము, శ్రీ స్వామి వారి మొక్కు/శాశ్వతకళ్యాణములు, బ్రహ్మోత్సవములు మొదలగు అర్జిత సేవల) నిర్వహణను నిలుపుదల చేయుచూ మరియు కళ్యాణకట్ట, వ్రతమండపం, అన్నదానం తేది.20.03.2020 నుండి తేది.31.03.2020 వరకు రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
ప్రజలు ఆలయ సమీపంలో గుంపులుగా ఉండకుండా సహకరించాలని కోరారు.