ఉప్పల్ మినీ శిల్పారామంలో అలరించిన కర్ణాటక సంగీత విభావరి, కూచిపూడి నృత్య ప్రదర్శనలు

ఉప్పల్ మినీ శిల్పారామంలో అలరించిన కర్ణాటక సంగీత విభావరి, కూచిపూడి నృత్య ప్రదర్శనలు 

ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా  ఇందిరా కళానికేతన్ సంగీత నృత్యాలయం  గురువర్యులు గోవర్ధనం ఇందిరా శిష్య బృందంచే కర్ణాటక సంగీత విభావరి మరియు కూచిపూడి నృత్య ప్రదర్శన ఆధ్యంతం అలరించింది. ఇందిరా, గాయత్రీ, రాధికా, తేజశ్రీ, షణ్ముఖి, అనుష్క, దివ్య చందన కళాకారులు శరణు శారు సురేంద్ర సన్నుత, ఇందరికి అభయమ్ము, శ్రీరంగ దాసు, నారాయణ తీర్థ  తారంగం, శివాష్టకం, భో శంభో దయానంద సరస్వతి కీర్తన, త్యాగరాజ కృతి,  మొదలైన సంగీర్తనలను ఆలపించారు.

కూచిపూడి నృత్య ప్రదర్శనలో భాగంగా వినాయక కౌతం, పుష్పాంజలి, దశావతారాలు, శంభో మహాదేవో, నారాయణతేయ్, కృష్ణం కలయ సఖి, పలుకే బంగారమాయెనా, ఆనంద తాండవం మొదలైన అంశాలను మహతి, మనోజ్ఞ, తేజస్వి, కోమల, పవిత్ర, వృందా, అనూష, శ్రేష్ఠ , కళాకారులు ప్రదర్శించారు.  వీరికి చంద్ర శేఖర్, మురళీధర్, శర్మ సుసర్ల, వెంకట్ వాద్య సహకారం అందించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *