ఉప్పల్ మినీ శిల్పారామంలో శ్రీమతి శ్రీదేవి బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి 6-Dec-20
ఉప్పల్ మినీ శిల్పారామంలో శ్రీమతి శ్రీదేవి బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి
వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఉప్పల్ మినీ శిల్పారామం ఆంఫి థియేటర్ లో శ్రీమతి శ్రీదేవి బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.
వినాయక కౌతం, సూర్యాష్టకం జయ జయ దుర్గే, కొలువైతివా, రుక్మిణి ప్రవేశధరువు, జగదానంద కారక, త్యాగరాజ పంచరత్న కీర్తనలను ప్రదర్శించారు. శ్రీమతి శ్రీదేవి, నందిత, లక్ష్మి, అరుణ, చందన అంశాలను ప్రదర్శించి మెప్పించారు.