శిల్పారామం మాదాపూర్ మరియు శ్రీ సాయి నటరాజ అకాడమీ అఫ్ కూచిపూడి డాన్స్ నిర్వహణలో అల‌రించిన “కేళికలాపం” కూచిపూడి నృత్య‌ ప్ర‌ద‌ర్శ‌న‌లు

శిల్పారామం మాదాపూర్ మరియు శ్రీ సాయి నటరాజ అకాడమీ అఫ్ కూచిపూడి డాన్స్ నిర్వహణలో అల‌రించిన “కేళికలాపం” కూచిపూడి నృత్య ‌ప్ర‌ద‌ర్శ‌న‌లు

Mahdapur Shilparamam & Sri Sai Academy of Kuchipudi Dance kelikalapam kuchipudi dance performances impress 

మాదాపూర్‌లోని శిల్పారామంలో వారాంత‌పు సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌లో భాగంగా శిల్పారామం మాదాపూర్ మరియు శ్రీ సాయి నటరాజ అకాడమీ అఫ్ కూచిపూడి డాన్స్ నిర్వహణలో గురువర్యులు కళాశ్రీ డాక్టర్ రమాదేవి చేసిన “కేళికలాపం” – భామాకలాపం, దాదినమ్మ కలాపాలను కూచిపూడి నృత్య శైలి లో ప్రదర్శించి మెప్పించారు .

కూచిపూడి నృత్య శైలిలో ఎంత ప్రాముఖ్యత క‌లిగి అంతరిచిపోతున్న కలాపాలను డాక్టర్ రమాదేవి శ‌ని, ఆదివారాల్లో ప్ర‌ద‌ర్శించ‌నున్న‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు. సిద్ధేంద్ర యోగి విరచితమై ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకున్న ” భామాకలాపం ప్ర‌ద‌ర్శ‌న‌లో సత్యభామ పాత్ర‌లో నర్తించి మెప్పించారు.

భామనీ సత్యభామనీ అంటూ దరువు ను ప్రారంభించి.. శ్రీ కృష్ణుడికి తన చెలికతై మాధవి ద్వారా సందేశాన్ని పంపి శ్రీకృష్ణుడి రక కోసం ఎదురు చూస్తుంది. ఈ వృత్తాన్తని డాక్టరు రమాదేవి కృష్ణుడిగా, శ్రీమతి రాజరాజేశ్వరీ, మాధవిగ పసుమర్తి శేషుబాబు సహకరించారు.

తరువాత బ్రహ్మశ్రీ అల్లంపాటి అగస్త్య విరచితమైన నీలావతి విజయం లోనుండి స్వీకరించిన కలాపం” దాదినమ్మ కలాపం” ఎంతో సౌందర్యవతి అయినా “నీలావతి ” ని ఒంటిస్తంభ పై బంధిస్తారు. తనకి కాపలాగా దాదినమ్మ అనే ఒక ముసలావిడను పెడతారు. నీలావతిని తీసుకొచ్చినివారిని ఘనంగా సత్కరిస్తాను అని మగధ దేశ రాజు చాటింపు వేస్తాడు. ఒక దొంగ పగటివేషం వేసుకొని నీలావతి రాజకుమారి ని ఎత్తుకెళ్తాడు . అది గమనించిన ఒక రాజు ఆమే విడిపించి తండి దెగరకు చేరుస్తారు . ఆ రాకుమారి తండ్రి సంతోషించి ఆ రాజుకి ఇచ్చి వివాహం చేస్తాడు.. ఈ కతని డాక్టర్ రమాదేవి తన శిష్య బృందం కలప శైలిలో ప్రదర్శించి మెప్పించారు.

 

1 thought on “శిల్పారామం మాదాపూర్ మరియు శ్రీ సాయి నటరాజ అకాడమీ అఫ్ కూచిపూడి డాన్స్ నిర్వహణలో అల‌రించిన “కేళికలాపం” కూచిపూడి నృత్య‌ ప్ర‌ద‌ర్శ‌న‌లు”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *