తిరుమల, 2020 అక్టోబ‌రు 23: అశ్వవాహనంపై అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు – ఎనిమిదో రోజు రాత్రి శ్రీవారి న‌వ‌రాత్రి‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా

2020 శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు  

అశ్వవాహనంపై అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు

తిరుమల, 2020 అక్టోబ‌రు 23: శ్రీవారి న‌వ‌రాత్రి‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన శుక్ర‌వారం రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీమలయప్పస్వామి వారు క‌ల్కి అలంకారంలో అశ్వ వాహ‌నంపై దర్శనమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోన రఘుపతి వాహ‌న‌సేవ‌లో పాల్గొన్నారు.

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాదిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నాడు.

కాగా, న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో చివ‌రి రోజైన శ‌నివారం ఉద‌యం 6 నుండి 9 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని అయిన మ‌హ‌ల్లో స్న‌ప‌న తిరుమంజ‌నం, చ‌క్ర‌స్నానం నిర్వ‌హిస్తారు. రాత్రి 7 గంట‌లకు ఆల‌యంలో బంగారు తిరుచ్చి ఉత్స‌వం జ‌రుగ‌నుంది.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, పార్ల‌మెంటు స‌భ్యులు శ్రీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు శ్రీ‌మ‌తి ప్ర‌శాంతిరెడ్డి, శ్రీ కుపేంద్ర‌రెడ్డి, డా. నిశ్చిత‌, శ్రీ చిప్ప‌గిరి ప్ర‌సాద్‌, శ్రీ గోవింద‌హ‌రి, శ్రీ డిపి.అనంత‌, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *