శ్రీ త్యాగరాయగానసభ: మన మాతృ భాషను కాపాడుకోవాలి – ఏసిపి రాందాస్ తేజావత్

మన మాతృ భాషను కాపాడుకోవాలి – ఏసిపి రాందాస్ తేజావత్

ఈ రోజు శ్రీ త్యాగరాయ గానసభలో మ్యూజికల్ ఎంఫోరియా 3 శీర్షికన నిర్వహించిన హిందీ, తెలుగు మరియు బంగ్లా పాటల కలయికలో గాయని గాయకులు పాడిన మధురమైన పాటలు ప్రేక్షకుల హృదయాలను రంజింపచేసాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఏసీపీ రాందాస్ తేజావత్ మాట్లాడుతూ గాయని గాయకులందరు చాలా చక్కగా పడారాని, ఇవాళ తెలుగు బాషా దినోత్సవం రోజు ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులు సత్య కృష్ణ మరియు పాల్గొన్న గాయని గాయకులందరిని అభినందించారు. ఈ రోజుల్లో ఆంగ్లం ముఖ్యమైనా, ఒక భాషగా
ఆంగ్లం నేర్చుకున్నా, మన మాతృ భాషను మాత్రం మరిచిపోవద్దని,  మన మాతృ భాషను, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలని ఏసిపి రాందాస్ అన్నారు.

పాల్గొన్న గాయని గాయకులను, సాంకేతిక కళాకారులను అతిధులు శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలను అందచేశారు. ఆతిథులను కూడా నిర్వాహకులు సన్మానించారు.

లీనా కార్యక్రమానికి వాఖ్యానం చేసారు. ఈ కార్యక్రమంలో దైవజ్ఞ శర్మ, వినోద్ గౌడ్, గాంధీ తదితరులు పాల్గొన్నారు.

 

 

Leave a Comment

Your email address will not be published.