Kalavaibhavam.com(26-Feb): పర్యాటక శాఖ పై మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం

పర్యాటక శాఖ పై మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం

రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పర్యాటక శాఖ పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశం లో హెరిటేజ్ సర్క్యూట్ లో భాగంగా పురావస్తు కట్టడాల పరిరక్షణకు చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని మంత్రి టూరిజం కార్పొరేషన్ ఎండికి ఆదేశించారు. హయత్ భక్షి మసీదులో జరుగుతున్న పునర్నిర్మాణం పనులను త్వరలో పరిశీలిస్తామన్నారు. సిరిసిల్ల, మిడ్ మానేరు లలో పర్యాటక ప్రదేశాల అభివృద్ధి పై చర్చించారు. గతంలో పర్యటన లో భాగంగా మంత్రి ఆదేశించిన విధంగా డిజైన్లు ను రూపొందించి ముఖ్యమంత్రి కెసిఆర్, కేటీఆర్ ఆదేశాలమేరకు టూరిజం అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో టూరిజం ఎం.డి. మనోహర్, ఎస్.ఈ అశోక్ పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *