29.07.2020: తెలుగు సాహిత్యం ఉన్నంతవరకు సినారె పేరు చిరస్మరణీయం – మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి; ఘనంగా డాక్టర్ సినారె జయంతి;  డా. సినారె సినీగీత సర్వస్వం ఆరో సంపుటి ఆవిష్కరణ; దర్భశయనం శ్రీనివాసాచార్యకు సినారె సాహితీ పురస్కారం

తెలుగు సాహిత్యం ఉన్నంతవరకు సినారె పేరు చిరస్మరణీయం – మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి; ఘనంగా డాక్టర్ సినారె జయంతి;  డా. సినారె సినీగీత సర్వస్వం ఆరో సంపుటి ఆవిష్కరణ; దర్భశయనం శ్రీనివాసాచార్యకు సినారె సాహితీ పురస్కారం

– ఆయన సాహిత్యంలో కవిరాజు .. నిత్య జీవితంలో రారాజు

– విశ్వంభర కావ్యంతో వారి కీర్తి విశ్వమంతా వ్యాపించింది

– వారి పేరును భవిష్యత్ తరాలకు అందించే క్రమంలో మనందరం ఎవరికి తోచిన ప్రయత్నం వారు చేయాలి

– గత ఏడాది రెండు రోజులు వనపర్తిలో సినారె జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది

– ఈ తరానికి వారి స్ఫూర్థిని అందించడానికి సదస్సు అంశాలు సంచిక ఉండాలని ‘మన సినారె’ ప్రత్యేక సంచికను తీసుకువచ్చాం

– సినారె సాహిత్య సదన్ కు నేడు హైదరాబాద్ లో శంకుస్థాపన జరగడం శుభసూచకం

– వచ్చే ఏడాది సినారె జయంతి నాటికి సి.నారాయణరెడ్డి గారి కాంస్య విగ్రహం వనపర్తిలో ఆవిష్కరిస్తాం

హైదరాబాద్​లోని తెలంగాణ సారస్వత పరిషత్​లో సినారె జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి హాజరైనారు. విశ్వంభర కావ్యంతో డాక్టర్ సి.నారాయణ రెడ్డి విశ్వకవిగా గుర్తింపు పొందారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సినారె సాహిత్య సదన్‌కు హైదరాబాద్‌లో శంకుస్థాపన జరగడం శుభసూచకమని సంతోషం వ్యక్తం చేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నిరంజన్‌రెడ్డి డాక్టర్ సినారె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుశీలా నారాయణరెడ్డి ప్రచురించిన డాక్టర్ సినారె సినీగీత సర్వస్వం 6వ సంపుటిని మంత్రి ఆవిష్కరించారు.

కవుల తోనే గాక తరువాత తరం కవులతోనూ పోటీపడి సినారె కవిత్వం రాశారని రాశారని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ నారాయణ రెడ్డికి నా మీద పుత్ర ప్రేమ, వారికి తాను ఏకలవ్య శిష్యుడ్ని అని అన్నారు. ఢిల్లీలో రాజ్యసభ్యుడిగా వారితో పాటు నేను ఐదేళ్లు ఉండడం నా అదృష్టం అని చెప్పారు.

ఈ సందర్భంగా ప్రముఖ కవి దర్భశయనం శ్రీనివాసాచార్యకు డాక్టర్ సినారె సాహితీ పురస్కా రాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రదానం చేశారు. పుర స్కార గ్రహీత శ్రీనివాసాచార్య డాక్టర్ సినారె నుంచి స్ఫూర్తి పొందానని తెలిపారు.

సారస్వత పరిషత్ అధ్యక్షులు ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పరిషత్ ప్రధాన కార్య దర్శి డాక్టర్ చెన్నయ్య స్వాగతోపాన్యాసం చేశారు.

సినారె జయంతి కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్, సాంస్కృతిక శాఖ సంచా లకుడు మామిడి హరికృష్ణ, తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు ఎల్లూరి శివారెడ్డి, డాక్టర్ జుర్రు చెన్నయ్య, ఆంధ్రప్రదేశ్ భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, రసమయి సంస్థ అధ్యక్షులు డాక్టర్ ఎం.కె. రాము తదితరులు పాల్గొన్నారు.

1 thought on “29.07.2020: తెలుగు సాహిత్యం ఉన్నంతవరకు సినారె పేరు చిరస్మరణీయం – మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి; ఘనంగా డాక్టర్ సినారె జయంతి;  డా. సినారె సినీగీత సర్వస్వం ఆరో సంపుటి ఆవిష్కరణ; దర్భశయనం శ్రీనివాసాచార్యకు సినారె సాహితీ పురస్కారం”

Leave a Comment

Your email address will not be published.