పద్మ శ్రీ గుస్సాడీ రాజు కనకరాజును అభినందించిన రాష్ట్ర మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్

పద్మ శ్రీ గుస్సాడీ రాజు కనకరాజును అభినందించిన రాష్ట్ర మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్

Minister V.Srinivas Goud, felicitated Padmasri Awardee Kanakaraju at Minister Chambers, Ravindra Bharathi, Hyderabad

రాజ్ గోండు గిరిజనుల ప్రత్యేక నాట్య కళ గుస్సాడీలో అపార నైపుణ్యం గడించిన కుమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయి గ్రామానికి చెందిన గుస్సాడీ రాజు కనకరాజు సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డు ప్రకటించిన అనంతరం రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తో హైదరాబాద్ లోని రవీంద్రభారతిలోని కార్యాలయంలో మర్యాద పూర్వకంగా భేటి అయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆదివాసీ గుడేల్లో మాత్రమే కనిపించే గుస్సాడీ నృత్యం ఒక విశిష్టమైన కళ అని మంత్రి అభివర్ణించారు.

ఆదివాసీ నృత్యం గుస్సాడీ ని కొత్త తరానికి అందిస్తున్న కనకరాజు సేవలను గుర్తించి పద్మ శ్రీ పురస్కారం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాచీన నృత్యం పై మైదాన ప్రాంతాల్లో ని వారికి అవగాహన తక్కువ అన్నారు. వందల ఏళ్ల నుంచి ఈ ప్రాచీన దేవతా కళ తరతరాలు దాటుకుంటూ ప్రస్తుత రోబోటిక్ యుగంలోనూ కోనసాగుతోందన్నారు. గుస్సాడీ నాట్యానికి మెరుగులు దిద్దటమే కాకుండా నేటి తరానికి శిక్షణ ఇస్తూ మరింత గొప్ప కళగా తీర్చిదిద్దుతున్న కనకరాజుని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా అభినందించి, ఘనంగా సన్మానించారు.

పద్మ శ్రీ పురస్కారం పొందిన కనకరాజు గారి సేవలకు గుర్తుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున 10 వేల రూపాయల ప్రత్యేక పెన్షన్ ను అందించేందుకు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దృష్టికి తీసుకెళ్లి అమలు చేస్తామన్నారు. కనకరాజుతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 12 మెట్ల కిన్నెర విద్వాంసులు, దర్శనం మొగిలయ్యకు త్వరలోనే అందిస్తామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక సంచాలకులు మామిడి హరికృష్ణ, కనకరాజు బృందం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *