ఉప్పల్ మినీ శిల్పారామంలో నటరాజ రామకృష్ణ 98వ జయంతి ఉత్సవాలలో భాగంగా గురు కళా కృష్ణ నేతృత్వంలో నటరాజ రామకృష్ణ ఆంధ్రనాట్యం ట్రస్ట్ మరియు వాగ్దేవి ఆర్ట్స్ అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమం నటరాజ తేజంలో అమితంగా ఆకర్షించిన పేరిణి నాట్య ప్రదర్శనలు
నటరాజ రామకృష్ణ 98వ జయంతి ఉత్సవాలలో భాగంగా గురు కళా కృష్ణ నేతృత్వంలో నటరాజ రామకృష్ణ ఆంధ్రనాట్యం ట్రస్ట్ మరియు వాగ్దేవి ఆర్ట్స్ అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమం నటరాజ తేజంలో అమితంగా ఆకర్షించిన పేరిణి నాట్య ప్రదర్శనలు
భరత కళాప్రపూర్ణ పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ 98వ జయంతి ఉత్సవాలలో భాగంగా గురు కళా కృష్ణ నేతృత్వంలో నటరాజ రామకృష్ణ ఆంధ్రనాట్యం ట్రస్ట్ మరియు వాగ్దేవి ఆర్ట్స్ అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమం నటరాజ తేజంలో భాగంగా ఉప్పల్ మినీ శిల్పారామంలో వివిధ సంస్థలకు చెందిన కళాకారులు పేరిణి నాట్య ప్రదర్శనలు ఎంతగానో ఆకర్షించాయి.
ఈ కార్యక్రమానికి గౌరవ అతిధులుగా డాక్టర్ సంగనభట్ల నరసయ్య, డాక్టర్ సత్యనారాయణ ధ్యావనపల్లి, ఆచార్య శ్రీ కళాకృష్ణతో పాటుగా వాగ్దేవి అకాడమీ వ్యవస్థాపకులు శ్రీమతి సంధ్య పవన్ మరియు ఇతర నాట్యగురువులు ముందుగా జ్యోతి ప్రకాశనంతో కార్యక్రమం ప్రారంభించారు.
తరువాత నృత్య ప్రదర్శనలో భాగంగా వాగ్దేవి ఆర్ట్స్ అకాడమీ శ్రీమతి సంధ్య పవన్ శిష్యబృందం ప్రవేశం, పుష్పాంజలి అంశాలతో పాటుగా సప్త రాగ తాళ స్వర నర్తనం ప్రదర్శించారు.
సూర్యాపేటకు చెందిన పి. ఆర్. కె. నాట్య ప్రపంచం గురు పేరణి రాజ్ కుమార్ శిష్యులు మేళప్రాప్తి మరియు తహనం, సమయతి, డమరుక, పిపీలక మొదలైన యతి విన్యాసాలు ప్రదర్శించారు.
చివరిగా వరంగల్ నటరాజ కళాకృష్ణ నృత్య జ్యోతి అకాడమీ రంజిత్ కుమార్ నవ్యజ శిష్య బృందం పంచభూత శబ్ద నర్తనాలు ప్రదర్శించారు.
నృత్య కార్యక్రమాలే కాకుండా ప్రత్యేక ప్రదర్శన గా సాండ్ ఆర్ట్ వేణుగోపాల్ గారు గురు నటరాజ రామకృష్ణ గారి చిత్రపటాన్ని వేదికపై స్పీడ్ గ్లిటర్ ఆర్ట్స్ లో అద్భుతంగా చిత్రించారు.
సభా కార్యక్రమంలో భాగంగా ఆచార్య కళా కృష్ణ, సంగనభట్ల నరసయ్య మరియు సత్యనారాయణ ధ్యానవల్లి గురు నటరాజ రామకృష్ణ గారి గురించి, వారు ఆంధ్రనాట్యం పేరిణి నృత్యాలకు చేసిన సేవ గురించి తెలంగాణ ప్రాంత విశిష్ట నృత్య సాంప్రదాయం పేరిణి గురించి ఎంతో గొప్పగా వివరించారు.
మరియు గత 40 సంవత్సరాలకు పైగా పేరిణి నృత్యానికి గాత్ర సహకారం అందించిన ప్రముఖ గాయకులు శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో కర్ణాటక గాత్ర అధ్యాపకులుగా పని చేసిన పూడి వెంకట్ రావుని మరియు ఆంధ్ర నాట్య, పేరిణి కళాకారులు, గురువు అయిన బండి కుమార్ ని కార్యక్రమ నిర్వాహకులు వాగ్దేవి ఆర్ట్స్ అకాడమీ శ్రీమతి శ్రీ సంధ్య పవన్ మరియు అతిథులు ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ రెండు రోజుల కార్యక్రమాలకు కుమారి సాత్విక పేన్న వ్యాఖ్యాతగా వ్యవహరించారు.