అమితంగా ఆకట్టుకున్న నాట్యసత్పదం కూచిపూడి నృత్య కదంబం

అమితంగా ఆకట్టుకున్న నాట్యసత్పదం కూచిపూడి నృత్య కదంబం

మాదాపూర్ శిల్పారామంలో ప్రదర్శించిన “నాట్యసత్పదం” కూచిపూడి నృత్య కదంబం అమితంగా ఆకట్టుకుంది. ఈ రోజు ఈ నృత్య ప్రదర్శనలో కేవలం పురుషులు మాత్రమే పాల్గొని చక్కని  ప్రదర్శనతో మెప్పించారు. కళాకారులు వెంకట్ గంగాధర్, చక్రవర్తి, దీక్షితులు, కుమారదత్త లు కూచిపూడి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలో కీర్తింతు గణనాధుని, ముందుక శబ్దం, జగదానందకారకా, శివాష్టకం, హంసానందిని తిల్లాన అంశాలను ప్రదర్శించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో నాట్యం మూవీ ఫేమ్ సంధ్య రాజు, నాట్య గురువులు బాలత్రిపురసుందరి, డాక్టర్ తాడేపల్లి హాజరై కళాకారులను ఆశీర్వదించి సత్కరించారు.

 

Leave a Comment

Your email address will not be published.