యాదాద్రి బ్రహ్మోత్సవములు-2021 రెండవరోజు: అత్యంత వైభవముగా ధ్వజారోహణ, భేరీపూజ, దేవతాహ్వానం, హవనము కార్యక్రమాలు

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవములు- 2021 రెండవరోజు

అత్యంత వైభవముగా ధ్వజారోహణ, భేరీపూజ, దేవతాహ్వానం, హవనము కార్యక్రమాలు

శ్లో|| మాతానృసింహశ్చ పితానృసింహః – భ్రాతానృసింహశ్చ సఖా నృసింహః |
విద్యా నృసింహో ద్రవిణం నృసింహః – స్వామీనృసింహ స్సకలం నృసింహః ||

కళావైభవం.కామ్ యాదాద్రి ప్రతినిధి శంకర్ పోతుగంటి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవములు- 2021 – రెండవరోజు (16-Mar) అత్యంత వైభవముగా ధ్వజారోహణ, భేరీపూజ, దేవతాహ్వానం, హవనము కార్యక్రమాలను నిర్వహించారు.

శ్రీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములలో భాగంగా ఈ రోజు తేది.16.3.2021 మంగళవారం ఉదయం శ్రీ స్వామి వారి బాలాలయములో నిత్య ఆరాధనల అనంతరం ఉదయం గం.11.00లకు ధ్వజారోహణ కార్యక్రమము శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారముగా ప్రధానార్చకులు, యాజ్ఞాచార్యులు, ఆలయ ఉప ప్రధానార్చకులు, అర్చక బృందము, పారాయణీకులు ఈ వేడుకను అత్యంత వైభవముగా నిర్వహించారు. ఈ వేడుకలలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎన్. గీత , సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని ప్రకటనలో తెలిపారు.

సాయంకాల కార్యక్రమములు:
ఈ రోజు సాయంకాలము శ్రీ స్వామి వారి బాలాలయములో నిత్యఆరాధనల అనంతరం భేరి పూజ, దేవతాహ్వానము, హవనము ప్రారంభించబడును. ఈ వేడుకలను ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, అర్చకబృందం నిర్వహించెదరు. ఈ వేడుకలలో ఆలయ అధికారులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొంటరరి అధికారులు తెలిపారు.

ఉచిత వైద్యశిభిరము:
ఈ రోజు తేది.16.03.2021న డా. మర్రి రాంరెడ్డి గారు ప్రిన్సిపల్, డివీస్ హోమియో మెడికల్ కాలేజి, కీసర, డా. పి.శంకర్ ప్రొఫెసర్ అన్వీస్ హోమియోపతి సూపర్ స్పెషాలిటీ క్లినిక్ ఉప్పల్, హైద్రాబాద్ వారిచే కొండక్రింద తులసీకాటేజి, నృసింహసదనం యందు ఉదయం గం.10.00ల నుండి మధ్యాహ్నం గం.1.00ల వరకు ఉచిత హోమియో వైద్యశిబిరము నిర్వహింపబడినది. సుమారు 200 మంది వరకు వీరి ఉచిత సేవలను పొందారని తెలిపారు.

Print Friendly, PDF & Email
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *