పద్య నాటకాలు తెలుగు భాషా సంపద – వోలెటి పార్వతీశం
పద్య నాటకాలు తెలుగు భాషా సంపద అని పద్యం మరే భాషా సాహిత్యల్లో లేదని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వోలెటి పార్వతీశం అన్నారు.
శ్రీ త్యాగరాయ గాన సభలోని కళా సుబ్బారావు కళా వేదిక పై సోమవారం స్టేజ్ లైన్ ఆర్ట్ థియేటర్ నిర్వహణలో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో భాస్కర్ దేవ్ దుర్యోధనుని మయ సభ దృశ్యం ఏక పాత్రాభినయంతో ఆకట్టుకొన్నారు. శ్రీకృష్ణ రాయబారం ద్వారక ఘట్టాన్ని చింతలపాటి సూల పని దర్శకత్యం లో ప్రదర్శించారు. సి. రాజస్య లక్ద్మీ కృష్ణునిగా సూల పని ఆర్గునినిగా బాల నాగేశ్వర్ రావు దుర్యోధనునిగా నటించారు.
అనంతరం జరిగిన సభా కార్యక్రమం లో ముఖ్య అతిధిగా వోలెటి పర్వతీశం పాల్గొని నటులు అనూష, డి. జె.రాజా, విజయ్ భాస్కర్, లను ఉమ మహేశ్వర రావు భుజంగ రావు జగన్ మోహన్ భాస్కర్ దేవ్ లను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. కళా జనార్ధన మూర్తి, రవి కుమార్ తదితరులు పాల్గొన్న సభకు కార్యదర్శి రవి కుమార్ నివేదిక సమర్పించారు